Breaking News
  • శ్రీకాకుళం: కచరాంలో తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం నిర్వాకం. రోడ్లపై గుర్రపు స్వారీ నిర్వహించిన తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం. బైక్‌పై వెళ్తున్న రాంబాబు, రమాదేవి దంపతులను గుద్దిన గుర్రం. ఆస్పత్రిలో రాంబాబు పరిస్థితి విషమం. పట్టించుకోని రిసార్ట్‌ యాజమాన్యం. రాసార్ట్‌ ఎదుట స్థానికుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం. భారీగా మోహరించిన పోలీసులు.
  • ప.గో: తణుకు మండలం దువ్వలో పిచ్చికుక్క స్వైర విహారం. పిచ్చికుక్క దాడిలో10 మందికి గాయాలు.
  • గుంటూరు: సత్తెనపల్లిలో మహిళ ఆత్మహత్యాయత్నం. చోరీ కేసు పెట్టారన్న మనస్థాపంతో నిద్రమాత్రలు మింగిన లక్ష్మీ. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కదిరి మండలం నడిమిపల్లిలో దారుణం. యువకుడు సుధాకర్‌ గొంతు కోసిన దుండగులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్‌. గతంలో రామాంజనేయులు భార్యను ఎత్తుకెళ్లి.. తిరిగి అప్పగించిన సుధాకర్‌. రామాంజనేయులుపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.
  • అనంతపురం: హిందూపురంలో రెచ్చిపోయిన వీధికుక్కలు. ఇద్దరు చిన్నారులపై దాడి. వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారులు. ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి విషమం.
  • విజయవాడ: వంశీ వ్యాఖ్యలపై అయ్యప్ప భక్త కమిటీ అభ్యంతరం. టీవీ9 డిబేట్‌లో వంశీ అనుచిత వ్యాఖ్యలు సరికాదు. అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. పరుష పదజాలంతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అయ్యప్ప భక్తులకు వంశీ కళంకం తెచ్చారు. ఇప్పటికైనా నియమనిష్టలతో దీక్ష చేయాలి-వేణుగోపాలస్వామి.
  • హైదరాబాద్‌: అశ్వత్థామరెడ్డి నివాసానికి వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి. అశ్వత్థామరెడ్డిని పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అందరూ ముందుకు రావాలి. అశ్వత్థామరెడ్డికి ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. కార్మికుల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి. సడక్‌బంద్‌ను విజయవంతం చేయాలి-ఎంపీ కోమటిరెడ్డి.

షాకింగ్.. బార్డర్‌లో బంగ్లా ఫైరింగ్.. జవాన్ మృతి.. అసలు కథేంటి..?

ఎవరూ ఊహించి ఉండరు. పసికూన బంగ్లాదేశ్ కయ్యానికి కాలుదువ్విందంటే.. అది కూడా భారత్‌పై. దశాబ్దాలుగా కొనసాగుతున్న శాంతి, సామరస్యాలకు చెక్ పెడుతూ.. ఎవరూ ఊహించని విధంగా భారత్, బంగ్లా బార్డర్లో ఘటన చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బంగ్లాదేశ్‌ దళాలు జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్‌కు చెందిన విజయ్‌భాన్‌సింగ్ అనే భారత జవాను ప్రాణాలు కోల్పోగా, మరో బీఎస్ఎఫ్ జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. ముర్షిదాబాద్ జిల్లాలోని సరిహద్దు వద్ద పెట్రోలింగ్ జరుపుతున్న బీఎస్‌ఎఫ్ టీంపై బంగ్లాదేశ్‌ సైన్యం కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్‌ జవాన్ ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే.. వెస్ట్ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ జిల్లా బోర్డర్‌ పోస్ట్‌ వద్ద పద్మానదిలోకి బీఎస్ఎఫ్‌ అనుమతితో ముగ్గురు మత్స్యకారులు చేపల వేటకు వెల్లారు. అయితే వీరిని బంగ్లా ఆర్మీ నిర్భంధించారు. ఆ తర్వాత ఇద్దరిని వదిలేసి.. ఒకర్ని వారి వద్దే బంధీగా ఉంచుకోవడంతో.. ఈ విషయాన్ని తిరిగి వచ్చిన మత్స్య కారులు బీఎస్ఎఫ్ జవాన్లకు తెలిపారు. అయితే ఆ మత్స్యకారుడిని విడిపించేందుకు వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్లపై ఉదయం ముగ్గురు మత్స్యకారులు భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పద్మ నదిలో చేపల వేటకు వెళ్లారు. వారిలో ఇద్దరు తిరిగొచ్చి కాక్మరిచార్ వద్ద బీఎస్‌ఎఫ్ పోస్టులో ఉన్న అధికారులను కలిసి.. చేపల వేటకు వెళ్లిన తమ ముగ్గురిని బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ పట్టుకున్నారని, ఒకరిని వారి అదుపులోనే ఉంచుకుని తమ ఇద్దరినీ విడిచిపెట్టారని చెప్పారు. అయితే వీరిని విడిపించేందుకు ఉదయం 10.30 గంటల సమయంలో కాక్మరిచార్ అవుట్ పోస్ట్ కమాండర్ మరో అయిదుగురు జవాన్లతో కలిసి బీఎస్‌ఎఫ్ బోటులో వెళ్లారు. పద్మ నదిలోని జల సరిహద్దు వద్ద గస్తీలో ఉన్న బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్‌ను సంప్రదించారు.

అయితే ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించినా తర్వాత.. భారత మత్స్యకారుడిని బంగ్లా ఆర్మీ విడిచిపెట్టలేదు. అంతేకాదు.. వెళ్లిన బీఎస్ఎఫ్ జవాన్లను చుట్టుముట్టడంతో.. అప్రమత్తమైన మన జవాన్లు వెంటనే వెనక్కు వచ్చేయడానికి ప్రయత్నించింది. అయితే అదేసమయంలో బంగ్లా ఆర్మీ.. భారత జవాన్లపై కాల్పులకు దిగింది. ఈ ఘటనలో బీఎస్ఎఫ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ విజయ్‌భాన్ సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మరో కానిస్టేబుల్‌ గాయపడటంతో.. ఆయన్ను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ అధికారులకు సమాచారం అందించినట్లు బీఎస్‌ఎఫ్ వెల్లడించింది. అయితే బంగ్లా ఆర్మీ మాత్రం మేము కాల్పులు జరపలేదని.. వాళ్లే జరిపారంటూ తోసిపుచ్చింది. మరి ఈ ఊహించని పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో వేచిచూడాలి.