బీఎస్ఎఫ్ రైడ్స్.. భారీగా నార్కోటిక్ డ్రగ్స్‌ స్వాధీనం..

త్రిపురలో భారీగా నార్కోటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. ఇండో-బంగ్లాదేశ్‌ సరిహద్దుల వద్ద ఈ డ్రగ్స్‌ను శనివారం ఉదయం పట్టుకున్నారు. వీటి విలువ రూ.24.23 లక్షలు ఉంటుందని అధికారులు..

బీఎస్ఎఫ్ రైడ్స్.. భారీగా నార్కోటిక్ డ్రగ్స్‌ స్వాధీనం..
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 8:19 PM

త్రిపురలో భారీగా నార్కోటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. ఇండో-బంగ్లాదేశ్‌ సరిహద్దుల వద్ద ఈ డ్రగ్స్‌ను శనివారం ఉదయం పట్టుకున్నారు. వీటి విలువ రూ.24.23 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గత కొద్ది రోజులుగా డ్రగ్స్‌ ముఠాలు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని తెలియడంతో సరిహద్దుల్లో గస్తీ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో శనివారం తెల్లవారు జామున నార్కోటిక్ డ్రగ్స్‌తో పాటు.. యాబా ట్యాబ్లెట్లు, ఫినాయిల్ బాటిళ్లు, ఇతర నిషేధిత డ్రగ్స్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సౌత్ త్రిపుర జిల్లాలోని దిమతోలీ ఔట్‌పోస్ట్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఫినాయిల్ బాటిళ్లను తీసుకెళ్తుండగా అనుమానం వచ్చి చెక్ చేయడంతో అందులో ఓ పాలిథిన్ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిని తెరిచి చూడటంతో అందులో రూ.22.50 లక్షల విలువ గల యాబా ట్యాబ్లెట్లను గుర్తించారు. అంతేకాదు రూ.91వేల విలువగల 540 ఫినాయిల్ బాటిళ్లు, మరో రూ.80 వేల విలువగల ఇతర పదార్దాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.