Breaking News
  • ఇకపై ఉమ్మేస్తే జరిమానే... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. రోడ్లు, సంస్థలు, ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 33కు చేరింది. మహబూబ్‌నగర్‌ టౌన్‌లో ఓ పసికందుకు కూడా ఈ మహమ్మారి సోకింది. గద్వాల జిల్లాలో అత్యధికంగా 22 కేసులు నమోదు అయ్యాయి.
  • ప్రకాశం: ఒంగోలులో మరో మూడు పాప్రభుత్వ ల్యాబ్ లలో, ఆమోదం తెలిపిన ప్రైవేట్ ల్యాబ్‌లలో అయినా కరోనా వైరస్ పరీక్షలను ఉచితంగా చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు. జిటివ్‌ కేసులు. ప్రకాశం జిల్లాలో 27కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు.
  • దేశ వ్యాప్తంగా 5274 కరోనా పాజిటివ్ కేస్ లు నమోదు. 4714 యాక్టీవ్ కరోనా పాజిటివ్ కేస్ లు. దేశం మొత్తం 149 మంది మృతి. 410 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
  • కామారెడ్డి జిల్లా కన్నకొడుకును చూడటానికి అడ్డువచ్చిన కరోనా లాక్ డౌన్. లెక్క చేయని కన్నతల్లి ప్రేమ. సుమారు 14 వందల కిలోమీటర్లు స్కూటీపై ఒంటరి ప్రయాణం. చివరికి కొడుకును చేరిన కన్నతల్లి. నిజామాబాద్ జిల్లా బోధన్ బోధన్ నుంచి నెల్లూరు వరకు స్కూటీపై ప్రయాణించిన తల్లి.

వేటకొడవళ్లతో నరికి చంపారు..

Brutal Murder, వేటకొడవళ్లతో నరికి చంపారు..

వేటకొడవళ్లతో ప్రత్యర్థులు దాడులు చేసుకోవడం సీమలో అప్పుడప్పుడు చూస్తూంటాం. అలాంటి సీనే ఇప్పుడు కరీంనగర్‌ జిల్లాలో రిపీట్ అయ్యింది. పట్టపగలు రోడ్డుపై ఓ యువకుడ్ని కత్తులతో నరికి చంపేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన వెనుక ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది.

వేములవాడ టౌన్‌లోని సుబ్రమణ్య నగర్‌కు చెందిన నాగులు రవి అనే వ్యక్తి.. ఓ యువతి తొమ్మిదేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు నో చెప్పారు.. యువతికి పెళ్లి చేశారు.

కాగా.. యువతి భర్త ఉపాధికోసం విదేశాలకు వెళ్లాడు. దీంతో అమ్మాయి పేరెంట్స్.. మాజీ ప్రియుడు రవి ఉన్న ఏరియాలోనే అద్దెకు దిగారు. మళ్లీ వీరి మధ్య ప్రేమ చిగురించిందని తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు.. సమయం కోసం వేచి చూశారు. ఇంటి వెనుక నుంచి బైక్‌పై రవి వెళ్లడం గమనించారు. వెనుక నుంచి వచ్చిన ముగ్గురు యువకులు కత్తితో.. కసితీరా నరికి చంపారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని ఓ సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజ్ ద్వారా.. పీడీయాక్ట్ కింద కేసు నమోదు పోలీసులు చేశారు. హత్య చేసిన వాళ్లని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు పోలీసులు.

Related Tags