Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

జమ్మూ కాశ్మీర్.. పాక్షికంగా బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల పునరుధ్ధరణ !

Broadband To Be Partially Restored In Kashmir Today, జమ్మూ కాశ్మీర్.. పాక్షికంగా బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల పునరుధ్ధరణ !

అయిదు నెలల నిషేధం అనంతరం జమ్మూ కాశ్మీర్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను బుధవారం నుంచి పాక్షికంగా పునరుధ్దరిస్తున్నారు.దశలవారీ  గా చేపట్టనున్న ఈ ప్రక్రియ ఇవాళ్టి నుంచి మొదలు కానుంది. అయితే సోషల్ మీడియాపై ఆంక్షలు కొనసాగనున్నాయి. కానీ ప్రభుత్వ వెబ్ సైట్లు, అత్యవసర సర్వీసుల సైట్లు, బ్యాంకింగ్ వంటి ఇతర సైట్లకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.  ఎలాంటి దుర్వినియోగం కాకుండా చూడడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే  బాధ్యత వీటిదేనని స్పష్టం చేశారు.

అలాగే నోడల్ ఆఫీసర్ల నియామకం, మానిటరింగ్ యూసేజ్  వంటివాటిని  కూడా ఇవి నిర్వహించవచ్చు.  మొదట శ్రీనగర్, ఆ తరువాత నార్త్, అనంతరం సౌత్ కాశ్మీర్ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. వారం రోజుల అనంతరం రివ్యూ నిర్వహించాక లెఫ్టినెంట్ గవర్నర్.. సెల్ ఫోన్ ఇంటర్నెట్ పునరుధ్ధరణపై దృష్టి సారించనున్నారు. ఆగస్టు 5  నుంచి కాశ్మీర్ లోయలో ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని ఆంక్షలపై న రివ్యూ జరపాలని ఆదేశించవలసిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్ ను పురస్కరించుకుని సుప్రీంకోర్టు ఇఛ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.