కరోనాకు విరుగుడు.. వ్యాక్సీన్ తయారీలో బ్రిటిష్ రీసెర్చర్లు

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సీన్ ను కనుగొనడంలో బ్రిటిష్ శాస్త్రజ్ఞులు ముందడుగు వేశారు. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ కు చెందిన వీరు.. దీన్ని మొదట జంతువులపై పరీక్షించి చూడనున్నారు. వచ్ఛే వారం నుంచి ఈ పరీక్షలను ప్రారంభిస్తామని ప్రొఫెసర్ రాబిన్ షటూక్  ప్రకటించారు. ఈ వ్యాక్సీన్ తయారీకి తమ బృందం ఎంతో శ్రమించిందని, జంతువులపై ప్రయోగాల అనంతరం వచ్ఛే సమ్మర్ నుంచి మనుషులపై తమ ప్రయోగాలు ఉంటాయని ఆయన చెప్పారు. […]

కరోనాకు విరుగుడు.. వ్యాక్సీన్ తయారీలో బ్రిటిష్ రీసెర్చర్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 06, 2020 | 1:08 PM

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు విరుగుడు వ్యాక్సీన్ ను కనుగొనడంలో బ్రిటిష్ శాస్త్రజ్ఞులు ముందడుగు వేశారు. ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ కు చెందిన వీరు.. దీన్ని మొదట జంతువులపై పరీక్షించి చూడనున్నారు. వచ్ఛే వారం నుంచి ఈ పరీక్షలను ప్రారంభిస్తామని ప్రొఫెసర్ రాబిన్ షటూక్  ప్రకటించారు. ఈ వ్యాక్సీన్ తయారీకి తమ బృందం ఎంతో శ్రమించిందని, జంతువులపై ప్రయోగాల అనంతరం వచ్ఛే సమ్మర్ నుంచి మనుషులపై తమ ప్రయోగాలు ఉంటాయని ఆయన చెప్పారు. అయితే తమ సంస్థకు మరిన్ని నిధులు అవసరమవుతాయన్నారు.  సార్స్ వంటి ఇన్ఫెక్షన్ తో కూడిన కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది శాస్త్రజ్ఞులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జికా వైరస్ కు విరుగుడుగా వ్యాక్సీన్ తయారు చేసే పనిలో చాలామంది రీసెర్చర్లు ఉన్నారు. ఏడు నెలలుగా దీనిపై పరిశోధనలు చేస్తున్న వీరు.. త్వరలో మనుషులపై పరీక్షలు జరపనున్నారు.

అటు-కరోనా వ్యాధికి గురై చైనాలో మృత్యువాత పడినవారి సంఖ్య 500 కు పైగా పెరిగింది. సుమారు 30 దేశాల్లో 25 వేలమందిలో కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినట్టు అంచనా. సాధారణంగా ఓ వ్యాక్సీన్ తయారీకి రెండు నుంచి మూడేళ్లు పడుతుందని, కానీ తాము స్వల్ప కాలంలో వ్యాక్సీన్ తయారు చేశామని రాబిన్ షటూక్ వెల్లడించారు. మా సంస్థకు నిధుల కొరత చాలా ఉంది. అందువల్ల ఈ లోటు తీరిన పక్షంలో రాగల రెండు, మూడు నెలల్లోనే మానవాళిపైకూడా మా పరీక్షలు ప్రారంభిస్తాం అని ఆయన చెప్పారు.