బ్రిటన్‌ యువరాజ దంపతులకు పుత్రోత్సాహం

బ్రిటన్ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ తండ్రి అయ్యారు. అతని సతీమణి మేఘన్‌ మార్కెల్‌ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హ్యరీ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. 3.2 కేజీల బరువుతో మగబిడ్డ జన్మించారని, తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని బ్రిటన్‌ రాజు అధికారిక నివాసం బకింగ్‌హామ్ ప్యాలెస్‌ తెలిపింది. ‘మొదటి సారి తండ్రినవుతున్నందుకు ఆనందంగా.. ఆశ్చర్యంగా.. అద్భుతంగా ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం’ అని హ్యారీ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ బిడ్డకు రెండు పౌరసత్వాలు […]

బ్రిటన్‌ యువరాజ దంపతులకు పుత్రోత్సాహం
Follow us

| Edited By:

Updated on: May 06, 2019 | 9:43 PM

బ్రిటన్ యువరాజు ప్రిన్స్‌ హ్యారీ తండ్రి అయ్యారు. అతని సతీమణి మేఘన్‌ మార్కెల్‌ సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హ్యరీ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. 3.2 కేజీల బరువుతో మగబిడ్డ జన్మించారని, తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని బ్రిటన్‌ రాజు అధికారిక నివాసం బకింగ్‌హామ్ ప్యాలెస్‌ తెలిపింది. ‘మొదటి సారి తండ్రినవుతున్నందుకు ఆనందంగా.. ఆశ్చర్యంగా.. అద్భుతంగా ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం’ అని హ్యారీ ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఈ బిడ్డకు రెండు పౌరసత్వాలు సంక్రమించనున్నాయి. బ్రిటన్‌ పౌరసత్వంతో పాటు తల్లి మేఘన్‌ నుంచి అమెరికా పౌరసత్వమూ ఈ బిడ్డకు రానుంది. మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ దంపతులకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. బ్రిటన్ ప్రధాని థెరీసా మే ఈ సందర్భంగా ట్వీట్‌ చేస్తూ ‘కంగ్రాట్స్‌ డ్యూక్‌ అండ్‌ డచ్చెస్. ఈ మధుర ఘడియలను ఆనందంగా గడపండి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.