ఎన్టీఆర్ సరసన బ్రిటన్ బ్యూటీ.. రామ్ చరణ్‌కి బ్రేక్..!

RRR Movie Update: British Actress Opposite Jr NTR In SS Rajamoulis New Movie, ఎన్టీఆర్ సరసన బ్రిటన్ బ్యూటీ.. రామ్ చరణ్‌కి బ్రేక్..!

రాజమౌళి సినిమాలో ఎన్టీఆర్‌తో జోడీ కడుతున్న హీరోయిన్ ఎవరా అన్న అనుమానాలకు ఎండ్ కార్డ్ పడింది. ఎన్టీఆర్‌కి హీరోయిన్‌గా మొదట బ్రిటన్ కి చెందిన డైసీ అనే భామని తీసుకున్నారు. ఆమె తప్పుకోవడంతో మళ్లీ బ్రిటీష్ హీరోయిన్‌ని ఫిక్స్ చేశారు. ఆమె పేరుని త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటిస్తారని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ సమరయోధుడు కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. కొమరం భీమ్ తన యంగ్ ఏజ్‌లో ఎలా ఉండేవాడు. ఆయన.. అల్లూరి సీతారామరాజుతో కలిసి దేశమంతా ఎలా తిరిగాడు. ఆ టైమ్‌లో బ్రిటీష్ భామతో ప్రేమాయణం వంటి కథలో ఈ సినిమా రూపొందనుంది. కొమరం భీమ్‌‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఇక రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది. అయితే ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన సీన్లను కేవలం ఎన్టీఆర్ పైనే చిత్రీకరించనున్నారు. ఒక నెల రోజుల పాటు చరణ్‌కి బ్రేక్ ఇచ్చారు. విదేశాలకి సంబంధించిన కొన్ని సీన్లను ఎన్టీఆర్ పై ఈ నెల 26 నుంచి తీస్తారు. బల్గేరియాలో ఈ షూటింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, రాజమౌళి ఇప్పుడు బల్గేరియాకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *