వ్యాక్సిన్ కోసం బ్రిటన్ భారీ ఒప్పందం

దేశాలన్నీ ఎప్పుడెపుడాని వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే, బ్రిటన్‌ మాత్రం ఒక అడుగు ముందుకేసి, టీకాలు కనిపెట్టే పనిలో ఉన్న కంపెనీలతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా వ్యాక్సిన్ త్వరగా తయారు చేయాలని సనోఫీ, గ్లాక్సోస్మిత్ క్లైన్ కంపెనీతో భారీ అగ్రిమెంట్‌ చేసుకుంది.

వ్యాక్సిన్ కోసం బ్రిటన్ భారీ ఒప్పందం
Follow us

|

Updated on: Jul 30, 2020 | 3:04 AM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు టీకాను కనిపెట్టడంలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. దేశాలన్నీ ఎప్పుడెపుడాని వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే, బ్రిటన్‌ మాత్రం ఒక అడుగు ముందుకేసి, టీకాలు కనిపెట్టే పనిలో ఉన్న కంపెనీలతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా వ్యాక్సిన్ త్వరగా తయారు చేయాలని సనోఫీ, గ్లాక్సోస్మిత్ క్లైన్ కంపెనీతో భారీ అగ్రిమెంట్‌ చేసుకుంది. టీకా విజయవంతమైతే 60 మిలియన్ల వ్యాక్సిన్లు తమ దేశానికి ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి విజృంభణ నాటి నుంచి బ్రిటన్ టీకా కోసం చేసుకున్న నాలుగో ఒప్పందం ఇది.

కాగా, ఈ టీకాల కోసం సనోఫీ, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌కు ఎంత మొత్తం చెల్లిస్తున్నదో బ్రిటన్‌ వెల్లడించలేదు. అయితే, తమ టీకాకు రెగ్యులేటరీ ఆమోదం లభించిందనీ, క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమైతే 2021 జూన్‌ నాటికల్లా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని సనోఫీ, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ గతంలో తెలిపింది. వాక్సిన్ కోసం ఒక దేశంతో ఇది తమ మొదటి ఒప్పందం అని పేర్కొంది. అలాగే, యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఫ్రాన్స్‌ దేశాలతో డ్రగ్స్ కంపెనీ చర్చలు జరుపుతోంది. వ్యాక్సిన్ తయారి దశలోనే అగ్ర దేశాలన్ని ఔషధ కంపెనీలతో ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అటు ఖచ్చితంగా మందు ఎప్పుడొస్తుందన్న ఆశతో కరోనా బాధితులు ఎదురుచూస్తున్నాయి.