బ్రిటన్ లో ‘ దేశీ ‘ కేబినెట్.. ప్రీతి పటేల్ కి కీలక శాఖ

బ్రిటన్లో నూతన ప్రధానిగా బాధ్యతలు చేబట్టిన బోరిస్ జాన్సన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన ముగ్గురిని తన కేబినెట్ లోకి ఆయన తీసుకున్నారు. వీరికి కేబినెట్ హోదాల నిచ్చి హిస్టరీ సృష్టించారు. ప్రీతి పటేల్, అలోక్ శర్మ, రిషి సునక్.. ఈ ముగ్గురూ భారత సంతతికి చెందినవారు. బ్రిటీష్ ప్రభుత్వంలో ఇండియన్ ఆరిజిన్ సీనియర్ ఎంపీ అయినా ప్రీతి పటేల్ కి అత్యంత ప్రధానమైన హోం సెక్రటరీ పదవి లభించింది. అలాగే ఆగ్రాలో పుట్టి […]

బ్రిటన్ లో ' దేశీ ' కేబినెట్.. ప్రీతి పటేల్ కి కీలక శాఖ
Follow us

|

Updated on: Jul 25, 2019 | 1:22 PM

బ్రిటన్లో నూతన ప్రధానిగా బాధ్యతలు చేబట్టిన బోరిస్ జాన్సన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన ముగ్గురిని తన కేబినెట్ లోకి ఆయన తీసుకున్నారు. వీరికి కేబినెట్ హోదాల నిచ్చి హిస్టరీ సృష్టించారు. ప్రీతి పటేల్, అలోక్ శర్మ, రిషి సునక్.. ఈ ముగ్గురూ భారత సంతతికి చెందినవారు. బ్రిటీష్ ప్రభుత్వంలో ఇండియన్ ఆరిజిన్ సీనియర్ ఎంపీ అయినా ప్రీతి పటేల్ కి అత్యంత ప్రధానమైన హోం సెక్రటరీ పదవి లభించింది. అలాగే ఆగ్రాలో పుట్టి బ్రిటన్లో స్థిరపడి.. గతంలో జూనియర్ మంత్రిగా వ్యవహరించిన ఎంపీ అలోక్ శర్మకు ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ వ్యవహారాలపై సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా కేబినెట్ హోదా కల్పించారు. ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్. ఆర్. నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ ను ట్రెజరీ శాఖకు చీఫ్ సెక్రెటరీగా ప్రమోట్ చేశారు. మొత్తం 31 మందితో కూడిన బోరిస్ కేబినెట్లో పతి 8 మందిలో ఒకరు జాతిపరంగా మైనారిటీలకు చెందినవారు. బ్రిటిష్ పొలిటికల్ హిస్టరీలోనే ఇది విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.

వీరిలో ముఖ్యంగా ప్రీతి పటేల్ విషయానికి వస్తే..కీలక శాఖ లభించడం విశేషం. నేషనల్ సెక్యూరిటీ, టెర్రరిజం అదుపు, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ వంటి అతి ముఖ్యమైన వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వంటివారిని భారత్ కు అప్పగించాలా లేదా అన్నదానిపై నిర్ణయం తీసుకునే అధికారం ఆమెకు ఉంటుంది. అలాగే ఇండియాతో సంబంధాలతో బాటు బ్రెగ్జిట్ స్ట్రాటజీ అనంతరం బ్రిటన్ అనుసరించాల్సిన విధానంపై తీసుకోవాల్సిన నిర్ణయాధికారం కూడా ఈమెదే అవుతుంది. 47 ఏళ్ళ ప్రీతి పటేల్ టోరీ పార్టీలో ‘ రైజింగ్ స్టార్ ‘ గా, భవిష్యత్తులో బహుశా కాబోయే బ్రిటన్ ప్రధానిగా పాపులర్ అవుతున్నారు. మాజీ ప్రధాని థెరెస్సా మేరీ ఈమెను 2016 జులైలో ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ సెక్రటరిగా నియమించారు. అయితే ఓ హాలిడే రోజున ప్రీతి పటేల్ ఇజ్రాయెలీ ప్రభుత్వంతో అనధికారిక సమావేశాలను నిర్వహించినట్టు వార్తలు రావడంతో ఆమెను 2017నవంబరులో తొలగించారు. గుజరాత్ లో పుట్టి.. బ్రిటన్లో స్థిరపడిన ఈమె తలిదండ్రులు ఒకప్పుడు ఉగాండా నుంచి లండన్ కు వలస వచ్చారు. బ్రెగ్జిట్ రెఫరెండాన్ని గట్టిగా సమర్థించిన ప్రీతి పటేల్.. గతంలో బోరిస్ కు సన్నిహితురాలు.

ఇక 51 ఏళ్ళ అలోక్ శర్మ 2010 నుంచి ఎంపీగా ఉన్నారు. అంతకుముందు 16 సంవత్సరాలపాటు ఓ బ్యాంకులో చార్టర్డ్ అకౌంటెంటుగా పని చేశారు. కాగా-39 ఏళ్ళ రిషి సునక్ బ్రిటన్లో పుట్టారు. బ్రిటిష్-ఇండియన్ పేరెంట్స్ కు పుట్టిన ఈయనకు ట్రెజరీ శాఖ లభించింది. ఏమైనా ప్రీతి పటేల్ కు అత్యంత ప్రధాన శాఖ లభించడం బ్రిటన్లో సంచలనమైంది.

రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
ముఖేష్ అంబానీతో పెళ్లికి నీతా పెట్టిన కండీషన్ ఏంటో తెలుసా.?
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే
కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే