Breaking News
  • భారత్ దేశంలో 6 లక్షలు దాటినా కరోనా పాజిటివ్ కేసులు. గడిచిన ఐదు రోజుల్లోనే లక్ష కేసులు నమోదు. జూన్ నెలలో 4 లక్షల కేసులు,12 వేలకు పైగా మరణాలు. దేశవ్యాప్తంగా ఆరు లక్షలు దాటిన కరోనా కేసులు,18 వేలకు చేరువలో మరణాలు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 19,148 కేసులు, 434మంది మృతి. దేశవ్యాప్తంగా 6,04,641 కేసులు,17,834 మంది మృతి. దేశ వ్యాప్తంగా 2,26,947 యాక్టీవ్ కేసులు, 3,59,860 మంది డిశ్చార్జ్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజయవాడ: కోవిడ్ ఆసుపత్రి నుంచి వసంతరావు అనే వృద్దుడు అదృశ్యం. వారం అయినా ఆచూకీ లభించక పోవడంతో ఆందోళనలో కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వసంతరావు అదృశ్యం అయ్యాడంటున్న కుటుంబ సభ్యులు.
  • ఈరోజు, రేపు దక్షిణ తెలంగాణా జిల్లాల్లో భారీ వర్షాలు . మరో మూడు రోజులు తేలికపాటి వర్షాలు. రుతుపవనాలకు తోడైన ఉపరితల ఆవర్తనం . దక్షిణ ఒరిస్సా మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.
  • యూపీ ఢిల్లీ హర్యానా ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించనున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. కరోనా మహమ్మారిపై సమీక్ష.
  • భారీ రూపాన్ని తగ్గించుకుంటున్న ఖైరతాబాద్ వినాయకుడు . ఈ ఏడాది 27 అడుగులకే పరిమితమైన ఖైరతాబాద్ గణేషుడు . గత ఏడాదితో పోల్చితే 38 అడుగులు తగ్గిస్తున్న విగ్రహ ఆకారం . గత ఏడాది 65 ద్వాదశాదిత్య మహా గణపతి గా పూజలు . పూర్తి మట్టి వినాయకుడు గా ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయం. 27 అడుగులతో దన్వంతరి వినాయకుడి ని ఏర్పాటు చేయనున్న ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ. భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలు ఏర్పాటు చేస్తామంటున్నఖైరతాబాద్ నిర్వాహకులు. ఆన్లైన్ ద్వారా కూడా దర్శనానికి ఏర్పాట్లు . ప్రభుత్వ అనుమతి కోసం చూస్తున్నామంటున్న కమిటి.
  • ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన ఏపీ. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరిన ఏపీ. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ గతంలో స్టే ఇచ్చిన హైకోర్టు.
  • చెన్నై : అన్నాడీఎంకే పార్టీ లో కరోనా కలకలం . ఒక్కరోజులో ఇద్దరు ఎమ్మెల్యే లకు కరోనా నిర్ధారణ. పరమగుడి ఎమ్మెల్యే ప్రభాకరన్ , ఉలందూర్పేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు కుమరగురు కి కరోనా నిర్ధారణ . రాష్ట్రం లో డీఎంకే , అన్నాడిఎంకె పార్టీలలో ఇప్పటివరకు మంత్రి అన్బళగన్ తో సహా 8 మంది ఎమ్మెల్యే లకు కరోనా నిర్ధారణ.

బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రికీ కరోనా.. ఐసొలేషన్లో చికిత్స

బ్రిటిష్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డొరీస్ సైతం కరోనా వైరస్ బారిన పడ్డారు. గత శుక్రవారమే ఆమెకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. వారం రోజులుగా ఆమె బ్రిటన్ పార్లమెంటులో పలువురు సభ్యులతో సన్నిహితంగా మెలిగారు.
britain health minister nadine dorries tests positive for corona virus, బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రికీ కరోనా.. ఐసొలేషన్లో చికిత్స

బ్రిటిష్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డొరీస్ సైతం కరోనా వైరస్ బారిన పడ్డారు. గత శుక్రవారమే ఆమెకు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు పరీక్షల్లో తేలింది. వారం రోజులుగా ఆమె బ్రిటన్ పార్లమెంటులో పలువురు సభ్యులతో సన్నిహితంగా మెలిగారు. ప్రధాని బోరిస్ జాన్సన్ ఇఛ్చిన ఓ విందులో పాల్గొన్నారు. మహిళా దినోత్సవం రోజున ప్రత్యేకంగా బోరిస్ పలువురు ఎంపీలకు విందు ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా నాడిన్ డొరీస్ వారితో కలిసిమెలిసి సందడి చేశారు. అయితే ఆమెకు ఈ వైరస్ సోకినట్టు తెలియడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆమె ఎవరెవరిని కలిశారో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.  బ్రిటన్ లో తాజాగా కరోనాకు గురై ఆరుగురు మరణించగా.. 382 మందికి ఇన్ఫెక్షన్ సోకినట్టు తెలుస్తోంది.  నాడిన్ డొరీన్ ఆసుపత్రిలోని  ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారని, క్రమంగా కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. నిజానికి కరోనా అదుపునకు ఓ చట్టాన్ని రూపొందించిన ఈమె.. ఇదే వైరస్ బారిన పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వైరస్ చికిత్సకు సంబంధించి బీమా కంపెనీలకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ఫైలుపై ఈమె ఈ మధ్యే సంతకం చేశారు. ఇటలీతో బాటు బ్రిటన్ దేశాన్ని కూడా కరోనా కలవరపాటుకు గురి చేస్తోంది. విమానాశ్రయాలు, జనాలు గుమికూడే బహిరంగ ప్రదేశాల్లో కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది.britain health minister nadine dorries tests positive for corona virus, బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రికీ కరోనా.. ఐసొలేషన్లో చికిత్స

 

 

Related Tags