కరోనా కట్టడికి చౌక ఔషధం.. 200 మిల్లీ గ్రాముల టాబ్లెట్‌ ధర 59 రూపాయలు..

కోవిద్-19 రోగుల చికిత్స కోసం 'ఫావిటన్' బ్రాండ్ పేరుతో యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌ను మార్కెట్ చేయడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నుండి అనుమతి లభించినట్లు బ్రింటన్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది.

కరోనా కట్టడికి చౌక ఔషధం.. 200 మిల్లీ గ్రాముల టాబ్లెట్‌ ధర 59 రూపాయలు..
Follow us

| Edited By:

Updated on: Jul 23, 2020 | 8:59 PM

కోవిద్-19 రోగుల చికిత్స కోసం ‘ఫావిటన్’ బ్రాండ్ పేరుతో యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌ను మార్కెట్ చేయడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నుండి అనుమతి లభించినట్లు బ్రింటన్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. 200 మి.గ్రా టాబ్లెట్లలో లభించే ఔషధాన్ని టాబ్లెట్‌కు గరిష్టంగా రూ .59 చొప్పున విక్రయిస్తామని బ్రింటన్ ఫార్మాస్యూటికల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్లెన్‌మార్క్‌కు చెందిన ఫాబిఫ్లూ తరువాత, చవకగా లభించనున్న డ్రగ్‌ ఇదే కావడం విశేషం. ఫావిటన్ టాబ్లెట్‌ ధర 59 రూపాయలు. కాగా ఫ్యాబిఫ్లూ టాబ్లెట్‌ ధర 75 రూపాయలు.

భారత్ లో కోవిద్-19 రోగులకు చికిత్స చేయడానికి అత్యవసర వినియోగ అధికారం కింద జూన్ 2020 లో ఫావిపిరవిర్‌ను రెగ్యులేటరీ అధికారులు ఆమోదించారని బ్రింటన్ ఫార్మాస్యూటికల్స్ తెలిపింది. తేలికపాటి నుండి మధ్యస్థ లక్షణాలున్న కోవిడ్‌-19 రోగుల చికిత్సలో ఫావిపిరవిర్ సమర్థవంతమైన అనుకూలమైన ఫలితాలిస్తోందని, ఇందుకు క్లినికల్‌ సాక్ష్యాలున్నాయని బ్రింటన్ తెలిపింది. అలాగే ఈ ఔషధాన్ని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామన్నారు.

Also Read: ఎంట్రెన్స్‌ పరీక్షలు రద్దు.. డీమ్డ్‌ వర్సిటీలకు డిమాండ్..