భారీ వరదలతో.. బ్రిటన్ అస్థవ్యస్తం

Bridge collapses after flash floods in North Yorkshire, భారీ వరదలతో.. బ్రిటన్ అస్థవ్యస్తం

బ్రిటన్‌లో కురిసిన భారీ వర్షాలకు నార్త్ యార్క్‌షైర్‌లోని బెల్లార్బీ ప్రాంతంలో భారీగా వరద నీరు చేరింది. గ్రింటన్ ప్రాంతంలోని ఓ బ్రిడ్జ్.. వరదల ధాటికి కొట్టుకుపోయింది. దీంతో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. వీధుల్లో పారుతున్న వరదనీరు వాహనాలను ముంచెత్తింది. ఇళ్లలోకి సైతం నీరు చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. సహాయక చర్యలు చేపడుతోంది. నార్త్ ఇంగ్లాండ్‌తో పాటు స్కాట్‌లాండ్‌లో భారీ వర్ష సూచన ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *