తాగొచ్చిన వరుడు…తిరస్కరించిన వధువు

కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సి ఉండగా వరుడు తప్పతాగి పెళ్లి మంటపానికి తూలుతూ వచ్చాడు. అది గమనించిన వధువు ఆ యువకుణ్ని తిరస్కరించింది. వరుడి తరఫు బంధువులు గొడవకు దిగగా.. వధువు తల్లిదండ్రులు గట్టిగా బదులిచ్చారు. పెళ్లి రోజే తాగొచ్చిన అబ్బాయికి తమ పిల్లను ఎలా ఇవ్వమంటారని ప్రశ్నించారు. దీంతో చేసేదేం లేక ఆ తాగుబోతు యువకుణ్ని పెళ్లి మంటపం నుంచి తమ వెంట తీసుకెళ్లారు బంధువులు. పెళ్లి వేడుకల కోసం తీసుకొచ్చిన వస్తువులను యథావిధిగా […]

తాగొచ్చిన వరుడు...తిరస్కరించిన వధువు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 11, 2019 | 6:33 PM

కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సి ఉండగా వరుడు తప్పతాగి పెళ్లి మంటపానికి తూలుతూ వచ్చాడు. అది గమనించిన వధువు ఆ యువకుణ్ని తిరస్కరించింది. వరుడి తరఫు బంధువులు గొడవకు దిగగా.. వధువు తల్లిదండ్రులు గట్టిగా బదులిచ్చారు. పెళ్లి రోజే తాగొచ్చిన అబ్బాయికి తమ పిల్లను ఎలా ఇవ్వమంటారని ప్రశ్నించారు. దీంతో చేసేదేం లేక ఆ తాగుబోతు యువకుణ్ని పెళ్లి మంటపం నుంచి తమ వెంట తీసుకెళ్లారు బంధువులు. పెళ్లి వేడుకల కోసం తీసుకొచ్చిన వస్తువులను యథావిధిగా ప్యాక్ చేసుకొని వెళ్లిపోయారు.

బిహార్‌లోని ఛాప్రా పట్టణంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి రోజే తాగొచ్చి వివాహ వేదిక వద్ద నానా హంగామా చేశాడు. ఆ యువకుడు తనకు పెళ్లి జరుగుతోందన్న విషయం కూడా మరిచిపోయి ఫుల్లుగా తాగేసి వచ్చాడు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలో అతడున్నాడు. అలాంటి వాడికి మా అమ్మాయిని ఎలా ఇవ్వాలి?’ అని వధువు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. వధువు తీసుకున్న నిర్ణయానికి పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?