తెలంగాణలో నలుగురు.. ఏపీలో ఒకరు.. గోదావరి మింగేసిందా? జోరుగా గాలింపు చర్యలు.. స్నానానికని వెళ్ళి నీట మునక

తెలంగాణలో నలుగురు.. ఏపీలో ఒకరు.. గోదావరి మింగేసిందా? జోరుగా గాలింపు చర్యలు.. స్నానానికని వెళ్ళి నీట మునక

రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ఉదంతాల్లో మొత్తం ఐదుగురు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. తెలంగాణలో నలుగురు యువకులు, ఏపీలో ఒకరు గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు.

Rajesh Sharma

|

Nov 14, 2020 | 5:51 PM

Youth missing in Godavari river: రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు ఉదంతాల్లో మొత్తం ఐదుగురు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. తెలంగాణలో నలుగురు యువకులు, ఏపీలో ఒకరు గోదావరి నదిలో స్నానానికని దిగి మిస్సయ్యారు. రెండు చోట్ల ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

తెలంగాణలోని ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. గోదావరి నదిలో స్నానానికి వెళ్ళిన వారిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద ఈ సంఘటన జరిగింది. రంగరాయపురం గ్రామానికి చెందిన16 మంది యువకులు గోదావరి నదీ స్నానానికి వెళ్లగా.. నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని శ్రీకాంత్, తుమ్మ కార్తీక్, అన్వేష్, ప్రకాష్‌లుగా గుర్తించారు.

గోదావరి నదిలో గల్లంతైన నలుగురి కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. అటు ఆంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు దగ్గర గోదావరి నదీ స్నానానికి వెళ్ళారు ముగ్గురు యువకులు. ఈ ముగ్గురు ఆచంట మండలం కొడమంచిలి గ్రామానికి చెందిన వారు. కాగా వీరిలో కొండేటి ఏసు అనే యువకుడు గల్లంతయ్యాడు. మిగిలిన ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. గాలింపు చర్యలు చేపట్టారు.

ALSO READ: వేధింపులకు దివ్యాంగురాలు బలి.. ముగ్గురు యువకుల..

ALSO READ: పారిశుధ్య కార్మికులకు బంపర్ ఆఫర్.. దీపావళి నాడు..

ALSO READ: దిగ్దర్శకుడు విశ్వనాథ్‌తో చిరంజీవి భేటీ

ALSO READ: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ గ్రేట్ న్యూస్… 50% శాతం రాయితీ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu