ఎల్లుండి ఏపీలో ఉరుములతో పిడుగులు

ఎల్లుండి ఏపీలో ఉరుములతో పిడుగులు

అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి వెదర్ అలర్ట్ జారీ చేసింది. తాజా వెదర్ అలర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఉరుములు, మెరుపుల ముప్పు పొంచి వుంది. ఉరుములతో కూడిన పిడుగులు పడే ప్రమాదం వుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Rajesh Sharma

|

Nov 10, 2020 | 5:05 PM

Weather warning to Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉరుముల ముప్పు పొంచి వుందంటోంది అమరావతి వాతావరణ కేంద్రం. ఎల్లుండి (నవంబర్ 12వ తేదీన) ఏపీవ్యాప్తంగా ఉరుములు మెరుస్తూ పిడుగుల పడే అవకాశాలున్నాయని వెల్లడించింది. ‘‘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుండి గాలులు వీస్తున్నాయి.. పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది .. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, యానం, రాయలసీమ, ప్రాంతాల్లో ఈరోజు రేపు (నవంబర్ 10, 11వ తేదీల్లో) వాతావరణం పొడిగా ఉంటుంది.. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 లేక 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.. ఎల్లుండి (నవంబర్ 12వ తేదీన) ఉరుములు మెరుపులతో వర్షం విరుచుకుపడనుంది.. పిడుగులు పడే అవకాశం వుంది… ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది..’’ అని అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ALSO READ: గ్రేటర్ ఎన్నికల దిశగా ఈసీ కీలక ఆదేశాలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu