విశాఖ ‘గ్యాస్​ లీకేజీ’ ఘటనపై ఐక్యరాజ్యసమితి స్పంద‌న‌…

విశాఖ గ్యాస్​ లీకేజీ ఘటన మృతులకు ఐక్యరాజ్యసమితి సంతాపం తెలిపింది. 12 మంది మృతికి కారణమైన ఈ దుర్ఘ‌ట‌నపై తీవ్ర‌ విచారం వ్యక్తం చేసింది. భారత అధికారులు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి ప్రకటన రిలీజ్ చేశారు. “గ్యాస్​ లీకేజీ ఘటనలో మృతులకు సంతాపం తెలుపుతున్నాం. ఘటనతో ప్రభావితమైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ఘటనలపై సమగ్ర దర్యాప్తులు […]

విశాఖ 'గ్యాస్​ లీకేజీ' ఘటనపై  ఐక్యరాజ్యసమితి స్పంద‌న‌...
Follow us

|

Updated on: May 08, 2020 | 7:06 PM

విశాఖ గ్యాస్​ లీకేజీ ఘటన మృతులకు ఐక్యరాజ్యసమితి సంతాపం తెలిపింది. 12 మంది మృతికి కారణమైన ఈ దుర్ఘ‌ట‌నపై తీవ్ర‌ విచారం వ్యక్తం చేసింది. భారత అధికారులు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి ప్రకటన రిలీజ్ చేశారు.

“గ్యాస్​ లీకేజీ ఘటనలో మృతులకు సంతాపం తెలుపుతున్నాం. ఘటనతో ప్రభావితమైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ఘటనలపై సమగ్ర దర్యాప్తులు జరగాలి” అని స్టెఫానీ డుజారెక్ పేర్కొన్నారు.

విశాఖలోని ఎల్​జీ పాలిమర్స్​లో గురువారం తెల్ల‌వారుజామున విష‌వాయువు లీకైయిన ఘ‌ట‌న‌లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు