బండి సంజయ్ కు ఆ విషయం కూడా తెలీదా..! కేసీఆర్ ఢిల్లీ టూర్ కామెంట్లపై ఎమ్మెల్యే బాల్కా సుమన్ వార్నింగ్

ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. మోదీని ఏం కోరుతారో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలియదా అని..

బండి సంజయ్ కు ఆ విషయం కూడా తెలీదా..! కేసీఆర్ ఢిల్లీ టూర్ కామెంట్లపై ఎమ్మెల్యే బాల్కా సుమన్ వార్నింగ్

ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. మోదీని ఏం కోరుతారో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలియదా అని ప్రశ్నించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్. “మోదీ, కేసీఆర్ మధ్య ఎలాంటి చర్చ జరిగిందో బయటపెట్టాలని అంటున్నారు.. ఏముంటుందో ప్రజానికానికి తెలియదా “అని బాల్కా అన్నారు. “ఇప్పుడే కాదు.. కేసీఆర్.. గతంలో చాలా సందర్భాల్లో ప్రధానిని కలిశారు. బీజేపీ నేతలు అవగాహన ఉండే మాట్లాడుతున్నారా” అని సుమన్ నిలదీశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ గురించి మాట్లాడేప్పుడు.. ఆలోచించి మాట్లాడాలని తెలంగాణ బీజేపీ నేతల్ని బాల్కా సుమన్ హెచ్చరించారు.