మీ దళాల చొరబాటు అనైతికం, చైనాపై నిప్పులు కక్కిన రాజ్ నాథ్ సింగ్

లడాఖ్ లో చైనా సైనికుల చొరబాటును రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా తప్పు పట్టారు. ఉభయదేశాలమధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను ఉలంఘించే విధంగా మీ చర్యలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. రష్యాలో చైనా రక్షణమంత్రి ఫెంఘీ కి తనకు  మధ్య సుమారు 2 గంటలపైగా జరిగిన చర్చల్లో రాజ్ నాథ్ భారత వైఖరిని ఆయనకు స్పష్టం చేశారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. భారత దళాలు సంయమనంగా వ్యవహరిస్తున్నప్పటికీ మీ సైనికులు కవ్విస్తున్నారని, దాడులకు […]

  • Umakanth Rao
  • Publish Date - 3:22 pm, Sat, 5 September 20
మీ దళాల చొరబాటు అనైతికం, చైనాపై నిప్పులు కక్కిన రాజ్ నాథ్ సింగ్

లడాఖ్ లో చైనా సైనికుల చొరబాటును రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్రంగా తప్పు పట్టారు. ఉభయదేశాలమధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను ఉలంఘించే విధంగా మీ చర్యలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. రష్యాలో చైనా రక్షణమంత్రి ఫెంఘీ కి తనకు  మధ్య సుమారు 2 గంటలపైగా జరిగిన చర్చల్లో రాజ్ నాథ్ భారత వైఖరిని ఆయనకు స్పష్టం చేశారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. భారత దళాలు సంయమనంగా వ్యవహరిస్తున్నప్పటికీ మీ సైనికులు కవ్విస్తున్నారని, దాడులకు దిగుతున్నారని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. తమదేశ సా ర్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను రక్షించుకునే సామర్థ్యం భారత జవాన్లకు ఉందని ఆయన అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు మేం ప్రయత్నిస్తుంటే మీరు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే మొదట దూకుడుగా మాట్లాడిన ఫెంఘీ ఆ తరువాత రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలతో మెత్తబడినట్టు తెలుస్తోంది.