కరోనా యుద్దంలో గెలిచేశాం.. ఈటల సంచలన ప్రకటన

కరోనా యుద్దంలో గెలిచేశాం.. ఈటల సంచలన ప్రకటన

రాష్ట్రంలో కరోనా వైరస్‌ని ఆపడంలో సక్సెస్సయ్యామని ప్రకటించారు తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే రెడ్ జోన్స్ వున్నాయని ఆయన వెల్లడించారు

Rajesh Sharma

|

May 08, 2020 | 7:15 PM

రాష్ట్రంలో కరోనా వైరస్‌ని ఆపడంలో సక్సెస్సయ్యామని ప్రకటించారు తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే రెడ్ జోన్స్ వున్నాయని ఆయన వెల్లడించారు. డెబ్బయి అయిదేళ్ళ పెద్దాయనకు కూడా కరోనా పాజిటివ్ నుంచి నెగెటివ్‌కు వచ్చేలా చికిత్స చేయగలిగామని ఆయనంటున్నారు. రోజు వారీ కరోనా నియంత్రణా చర్యల సమీక్ష తర్వాత ఈటల శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

‘‘ తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఎక్కడ రెడ్ జోన్ లేదు.. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని మిగితా జిల్లాలను గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్లుగా మార్చాలి అని కేంద్రాన్ని కోరాము.. 75 సంవత్సరాల పెద్దాయనకు టెస్ట్ నెగిటివ్ రావటంతో త్వరలో డిశ్చార్జ్ చేయబోతున్నాం.. కోవిడ్ పాజిటివ్ గర్భిణికి గాంధీ వైద్యులు సిజేరియన్ చేసారు.. తల్లీ, బిడ్డ క్షేమంగా వున్నారు.. బాబు 3 కిలోలు బరువు ఉన్నాడు.. ’’ ఈటల వివరించారు.

జీహెచ్ఎంసీ పరిధిలో కట్టుదిట్టం చేయబోతున్నామని, వైరెస్ వ్యాప్తిని ఆపడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్సయ్యిందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు బయటికి రావాలంటే అంటే మాస్కు తప్పని సరి అని ఆయన మరోసారి ప్రకటించారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ పెరగటానికి కారణం 33 శాతం ఉద్యోగులతో పనులు చేసుకోవటానికి కేంద్రం అనుమతించడమే కారణమని ఈటల అంటున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu