తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు..జిల్లాల వారీగా వివ‌రాలు

తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు..జిల్లాల వారీగా వివ‌రాలు

తెలంగాణలో క‌రోనా వైర‌స్ తీవ్రత కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 1,896 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

Ram Naramaneni

|

Aug 11, 2020 | 9:28 AM

Telangana Corona Cases : తెలంగాణలో క‌రోనా వైర‌స్ తీవ్రత కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంటల్లో కొత్తగా 1,896 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం క‌రోనా సోకిన‌వారి సంఖ్య 82,647కి చేరింది. సోమ‌వారం క‌రోనాతో కొత్త‌గా 8 మృతి చెందగా.. మొత్తం చ‌నిపోయిన‌వారి సంఖ్య 645కి చేరింది. వ్యాధి బారి నుంచి సోమ‌వారం 1,788 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు వ్యాధిని జయించిన వారి సంఖ్య 59,374కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,628 యాక్టివ్‌ కేసులు ఉన్న‌ట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఇక తెలంగాణలో 6,42,875మందికి క‌రోనా టెస్టులు నిర్వ‌హించారు.

గ‌డిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా న‌మోదైన కేసులు

జీహెచ్ఎంసీ పరిధిలో 338 రంగారెడ్డి జిల్లాలో 147 కరీంనగర్ 121 మేడ్చల్ 119 వరంగల్ అర్బన్ 95 గద్వాల 85 జనగామ 71 కామారెడ్డి 71 ఖమ్మం 65 భద్రాద్రి 60 పెద్దపల్లి 66 సిద్ధిపేట 64

Also Read : తెలంగాణ : రైతు బీమా పథకం అమలు కోసం రూ.1173.54 కోట్లు విడుదల

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu