ఆ ఇద్దరితో ప్రాణహాని ఉంది : వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఫిర్యాదు

తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు తుళ్లూరు వైసీపీ కార్యకర్తలపై ఆమె ఫిర్యాదు చేశారు.తనపై సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేస్తున్నారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. శృంగారపాటి సందీప్, చలివేంద్రం సురేష్ లపై చర్యలు తీసుకోవాలని శ్రీదేవి పోలీసులను కోరారు. దీంతో నిందితులిద్దరిపై నగరం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని […]

  • Venkata Narayana
  • Publish Date - 2:40 pm, Sat, 7 November 20
ఆ ఇద్దరితో ప్రాణహాని ఉంది : వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఫిర్యాదు
undavalli-sridevi

తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు తుళ్లూరు వైసీపీ కార్యకర్తలపై ఆమె ఫిర్యాదు చేశారు.తనపై సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేస్తున్నారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. శృంగారపాటి సందీప్, చలివేంద్రం సురేష్ లపై చర్యలు తీసుకోవాలని శ్రీదేవి పోలీసులను కోరారు. దీంతో నిందితులిద్దరిపై నగరం పాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని నగరంపాలెం సిఐ మల్లికార్జునరావు టీవీ9కు చెప్పారు.