శ్రీదేవి చీర ఎంత పలికిందంటే..!

దివంగత నటి శ్రీదేవి ధరించిన ఖరీదైన చీరలను వేలం వేసి ఆ డబ్బును స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇవ్వాలని ఆమె కుటుంబసభ్యులు అనుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల శ్రీదేవి మొదటి వర్ధంతి సందర్భంగా ఆమెకు చెందిన ఒక కాటా చీరను ఆన్‌లైన్‌లో వేలం వేశారు. ఈ చీరకు ముందుగా రూ.40వేలను నిర్ణయించగా.. అది వేలంలో రూ.1.30వేలు పలికింది. ఈ మొత్తాన్ని బోనీకపూర్‌ కన్‌సర్న్ ఇండియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు అందించారు. దీనిపై […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:56 am, Tue, 26 February 19
శ్రీదేవి చీర ఎంత పలికిందంటే..!

దివంగత నటి శ్రీదేవి ధరించిన ఖరీదైన చీరలను వేలం వేసి ఆ డబ్బును స్వచ్ఛంద సేవా సంస్థలకు ఇవ్వాలని ఆమె కుటుంబసభ్యులు అనుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల శ్రీదేవి మొదటి వర్ధంతి సందర్భంగా ఆమెకు చెందిన ఒక కాటా చీరను ఆన్‌లైన్‌లో వేలం వేశారు. ఈ చీరకు ముందుగా రూ.40వేలను నిర్ణయించగా.. అది వేలంలో రూ.1.30వేలు పలికింది. ఈ మొత్తాన్ని బోనీకపూర్‌ కన్‌సర్న్ ఇండియా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు అందించారు. దీనిపై సంస్థ సంతోషాన్ని వ్యక్తం చేసింది. కాగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో వేలకు పైగా చిత్రాల్లో నటించిన శ్రీదేవి గతేడాది దుబాయిలో ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలిసిందే.