ఈ దశాబ్దంలోనే దారుణ ఉగ్రదాడి.. 185 మంది మృతి

క్రైస్తవుల పవిత్ర పండుగ ఈస్టర్ రోజున శ్రీలంకలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని కొలంబో సహా… 8 చోట్ల (మూడు చర్చిలు, మూడు హోటళ్లు) వరుస బాంబు పేలుళ్లు జరిపారు. ముఖ్యంగా కొలంబోలోని రెండు ప్రధాన చర్చిలలో అతి శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో 185 మంది చనిపోగా… 300 మందికి పైగా గాయాలైనట్లు తెలిసింది మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కోచికాడ్ చర్చి, సెబాస్టియన్ చర్చి పూర్తిగా తుక్కుతుక్కయ్యాయి. చర్చిలోని ఫర్నిచర్ ధ్వంసమై […]

ఈ దశాబ్దంలోనే దారుణ ఉగ్రదాడి.. 185 మంది మృతి
Ram Naramaneni

|

Apr 21, 2019 | 4:19 PM

క్రైస్తవుల పవిత్ర పండుగ ఈస్టర్ రోజున శ్రీలంకలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని కొలంబో సహా… 8 చోట్ల (మూడు చర్చిలు, మూడు హోటళ్లు) వరుస బాంబు పేలుళ్లు జరిపారు. ముఖ్యంగా కొలంబోలోని రెండు ప్రధాన చర్చిలలో అతి శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో 185 మంది చనిపోగా… 300 మందికి పైగా గాయాలైనట్లు తెలిసింది మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కోచికాడ్ చర్చి, సెబాస్టియన్ చర్చి పూర్తిగా తుక్కుతుక్కయ్యాయి. చర్చిలోని ఫర్నిచర్ ధ్వంసమై చాలా మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి గందరగోళంగా ఉంది.

చర్చిలో ప్రార్థనల కోసం వచ్చిన ప్రజలు… చెల్లా చెదురుగా పరుగులు తీశారు. గాయపడిన వారి అరుపులు, కేకలతో సంఘటన స్థలాలు భీతిల్లుతున్నాయి.  ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీలంకలో హైఅలర్ట్ ప్రకటించారు. అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. పేలుళ్ల ప్రాంతాన్ని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహేంద రాజపక్సే పరిశీలించారు. అత్యవసరంగా సమావేశమైన శ్రీలంక ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది. జహారానా, అబూ మహ్మద్ అనే ఇద్దరు ఈ పేలుళ్లకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మొత్తం 11 చర్చిలలో బాంబు పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందని శ్రీలంక నిఘా వర్గాలు నాలుగు రోజుల ముందే హెచ్చరించినా, ప్రభుత్వం, పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. ఇప్పటికే ఇండియా సహా పలు దేశాలు ఈ దారుణ దాడిని ఖండించాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu