శివకార్తికేయన్​ అల్టిమేట్ రికార్డ్.. ఏకంగా ర‌జ‌నీని అధిగమించాడు

కోలీవుడ్​లో హీరో ఎదిగిన తీరు ఎంద‌రికో ఆద‌ర్శ‌నీయం. టీవీ యాంక‌ర్ గా ప్ర‌స్తానం ప్రారంభించిన ఆయ‌న‌..న‌టుడిగా చిన్న‌, చిన్న పాత్ర‌లు వేస్తూ..ఇప్పుడు కోలీవుడ్ లో మంచి హీరోగా రాణిస్తున్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 9:55 pm, Mon, 13 July 20
శివకార్తికేయన్​ అల్టిమేట్ రికార్డ్.. ఏకంగా ర‌జ‌నీని అధిగమించాడు

కోలీవుడ్​లో హీరో శివకార్తికేయన్ ఎదిగిన తీరు ఎంద‌రికో ఆద‌ర్శ‌నీయం. టీవీ యాంక‌ర్ గా ప్ర‌స్తానం ప్రారంభించిన ఆయ‌న‌..న‌టుడిగా చిన్న‌, చిన్న పాత్ర‌లు వేస్తూ..ఇప్పుడు కోలీవుడ్ లో మంచి హీరోగా రాణిస్తున్నారు. అత‌డికి ఇప్ప‌డు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్ప‌డింది. అశేష అభిమానులను సొంతం చేసుకున్న హీరోల్లో శివకార్తికేయన్​ ఒకరు. తాజాగా, ఈ హీరో​ ట్విట్టర్​లో అరుదైన ఫీట్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు 6 మిలియన్ల మంది ఫాలోవర్స్​ను సొంతం చేసుకుని.. రజినీకాంత్​, విజయ్​ సేతుపతిలను సైడ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఇంతటి ఘనతను కారణమైన అభిమానులకు థాంక్స్ చెప్పాడు శివకార్తికేయన్ .

కాగా త‌మిళ‌నాడులో అత్యధిక ఫాలోవర్స్​ కలిగిన హీరో ధనుష్​. ట్విట్టర్​లో 9 మిలియన్లకు పైగా నెటిజ‌న్లు అత‌డిని అనుస‌రిస్తున్నారు. ఇక లోక‌నాయ‌కుడు కమల్​హాసన్​కు 7 మిలియన్ల మంది అనుస‌రిస్తున్నారు. ఇక రజనీ కాంత్​ను 5.7 మిలియన్ల అభిమానులు ఫాలో అవుతుండ‌గా.. విభిన్న పాత్ర‌లు పోషించే విజయ్​ సేతుపతికి 1 మిలియన్​ ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరినీ దాటి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు శివకార్తికేయన్​.ప్రస్తుతం శివకార్తికేయన్​ ‘డాక్టర్’​ అనే మూవీలో నటిస్తున్నాడు.మరోవైపు సైన్స్ ​ఫిక్షన్​ నేపథ్యంలో తెరకెక్కున్న ‘అయలాన్’​ అనే సినిమాలోనూ కనిపించనున్నాడీ హీరో.