#COVID19 శంషాబాద్ ఎయిర్‌పోర్టు షట్‌డౌన్ !

కరోనా సృష్టిస్తున్న భయాందోళన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో రెడ్ అలర్ట్‌కు దారితీస్తోంది. బుధవారం కొన్ని నిబంధనలను విధించగా.. గురువారం మరింత పకడ్బందీ చర్యలకు ఉపక్రమించారు. కరీంనగర్‌లో ఏకంగా ఒక్కరోజే ఏడుగురు ఇండొనేషియన్స్‌కు కరోనా

#COVID19 శంషాబాద్ ఎయిర్‌పోర్టు షట్‌డౌన్ !
Follow us

|

Updated on: Mar 19, 2020 | 2:33 PM

New restrictions in and around Shamshabad airport imposed: కరోనా సృష్టిస్తున్న భయాందోళన శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో రెడ్ అలర్ట్‌కు దారితీస్తోంది. బుధవారం కొన్ని నిబంధనలను విధించగా.. గురువారం మరింత పకడ్బందీ చర్యలకు ఉపక్రమించారు. కరీంనగర్‌లో ఏకంగా ఒక్కరోజే ఏడుగురు ఇండొనేషియన్స్‌కు కరోనా పాజిటివ్ రావడంతో విమాన ప్రయాణీకులపై మరింత నిఘా అవసరమని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు అధికారులు.

శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ కాస్తా రెడ్ అలర్ట్‌గా మారుతోంది. పోలీసుల దిగ్బంధంలో ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో కర్ఫ్యూ వాతావరణం తలపిస్తున్నది. విమానాశ్రయానికి వెళ్ళే మార్గాలను ఒక్కటొక్కటే మూసివేస్తున్నారు. అనుమతి ఉన్న వాహనాలను మాత్రమే లోనికి పంపిస్తున్నారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది. స్క్రీనింగ్ టెస్టులు చేసిన వెంటనే క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

విదేశాల నుండి వచ్చే ప్రతి ప్రయాణీకుడిని నేరుగా క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తున్నారు పోలీసులు. క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు అంబులెన్సుల సంఖ్యను బాగా పెంచారు. ప్రతీ విదేశీ ప్రయాణీకుడిని ముందుగా క్వారంటైన్ సెంటర్‌కు పంపి… నెగెటివ్ అని రెండు సార్లు తేలితేనే ఇంటికి పంపుతారు. అదే సమయంలో అతన్ని వచ్చే 14 రోజుల పాటు ఇంట్లోనే ఐసొలేషన్‌లో వుండాలని ఆదేశిస్తారు.