సచిన్‌పై నిప్పులు చెరిగిన సీఎం

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనను పదవి నుంచి లాగేసేందుకు యత్నించిన తన మాజీ సహచరుడు సచిన్ పైలట్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన అశోక్ గెహ్లాట్..

  • Rajesh Sharma
  • Publish Date - 4:38 pm, Mon, 20 July 20
సచిన్‌పై నిప్పులు చెరిగిన సీఎం

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనను పదవి నుంచి లాగేసేందుకు యత్నించిన తన మాజీ సహచరుడు సచిన్ పైలట్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన అశోక్ గెహ్లాట్.. సచిన్ పైలట్ పనికి మాలిన దద్దమ్మ అంటూ తీవ్ర పదజాలంతో దుయ్యబట్టారు. పనికిమాలినోడైనా పీసీసీ అధ్యక్ష పదవితోపాటు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గౌరవించిందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన సచిన్ పైలట్ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారాడని, అందుకే గత ఆరు నెలల నుంచి రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు యత్నించారని గెహ్లాట్ ఆరోపించారు. ఆరు నెలలుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు యత్నించారని, ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్నో కుట్రలు చేశారని ఆయన మండిపడ్డారు.

బీజేపీ పంచన చేరి, ముఖ్యమంత్రి కావాలనుకున్న సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం చేశారని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ వుందని, అయిదేళ్ళ పదవీ కాలాన్ని తాను పూర్తి చేసుకుంటానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.