నిర్భయ కేసు.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

నిర్భయ దోషులపై ఢిల్లీ హైకోర్టు బుధవారం మధ్యాహ్నం తీర్పు ప్రకటించనుంది. ఈ దోషులు నలుగురినీ ఉరి తీయాలని కేంద్రం…  కోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్ లో కోరుతోంది.  వీరు న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, తమ ఉరిని తప్పించుకునేందుకు జాప్యం చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నారని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ సురేష్ కైత్.. దోషుల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. నలుగురు దోషులనూ ఒకేసారి ఉరి తీయాలా లేక […]

నిర్భయ కేసు.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ

నిర్భయ దోషులపై ఢిల్లీ హైకోర్టు బుధవారం మధ్యాహ్నం తీర్పు ప్రకటించనుంది. ఈ దోషులు నలుగురినీ ఉరి తీయాలని కేంద్రం…  కోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్ లో కోరుతోంది.  వీరు న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, తమ ఉరిని తప్పించుకునేందుకు జాప్యం చేసే ఎత్తుగడలకు పాల్పడుతున్నారని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆరోపించారు. ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ సురేష్ కైత్.. దోషుల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. నలుగురు దోషులనూ ఒకేసారి ఉరి తీయాలా లేక మొదట ఇద్దరిని, ఆ తరువాత మరో ఇద్దరిని ఉరి తీయాలా అన్న విషయాన్ని ఆయన నిర్ధారించనున్నారు. ఈ కేసుపై గత ఆదివారం ప్రత్యేక విచారణ జరిపిన అనంతరం.. కోర్టు తన తీర్పును రిజర్వ్ లో ఉంచింది. కాగా-ముగ్గురు దోషుల క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇదివరకే తిరస్కరించింది. ముకేష్, వినయ్ ల మెర్సీ పిటిషన్లను రాష్ట్రపతి తోసిపుచ్చారు. ప్రస్తుతం అక్షయ్ మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి కార్యాలయంలో పెండింగులో ఉంది. పటియాలా హౌస్ కోర్టు ఈ నలుగురు దోషుల ఉరిపై స్టే జారీ చేసిన విషయం గమనార్హం.

Click on your DTH Provider to Add TV9 Telugu