బ్లడ్ కొరత… ఆసుపత్రుల్లో నరకం

కొలంబో ఉగ్రదాడిలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలతో శ్రీలంక రక్తమోడుతోంది. దాదాపు ఆరు చోట్ల జరిగిన పేలుళ్లలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య వందల్లోకి చేరింది. కొలంబో బయట రెండు పేలుళ్లలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. బట్టికలోవ చర్చిలో ఈస్టర్‌ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనల్లో భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగిన పేలుడులో మృతిచెందిన […]

బ్లడ్ కొరత... ఆసుపత్రుల్లో నరకం
Follow us

| Edited By:

Updated on: Apr 21, 2019 | 4:28 PM

కొలంబో ఉగ్రదాడిలో వరుస బాంబు పేలుళ్ల ఘటనలతో శ్రీలంక రక్తమోడుతోంది. దాదాపు ఆరు చోట్ల జరిగిన పేలుళ్లలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య వందల్లోకి చేరింది. కొలంబో బయట రెండు పేలుళ్లలో భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. బట్టికలోవ చర్చిలో ఈస్టర్‌ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనల్లో భారీ సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. ఇక్కడ జరిగిన పేలుడులో మృతిచెందిన వారిలో అత్యధికులు చిన్నారులే. ఇక్కడి క్షతగాత్రులను తరలించిన బట్టికలోవ టీచింగ్‌ ఆసుపత్రిలో రక్తం కొరత ఏర్పడింది. దీంతోపాటు నెగోంబోలోని ఆసుపత్రుల్లో కూడా రక్తం కొరత ఏర్పడింది. ఇక్కడికి ఓ పాజిటివ్‌, ఓ నెగిటివ్‌ రక్తం కొరత తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క బట్టికలోవలోనే దాదాపు 25 మంది మృతి చెందగా దాదాపు 75 మంది గాయపడినట్లు సమాచారం.

నెగొంబోలోని కత్వాపిటాయ చర్చిలో జరిగిన పేలుళ్లలో భారీగా ప్రాణనష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ దాదాపు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను తరలించిన స్థానిక ఆసుపత్రిలో కూడా రక్తం కొరత ఏర్పడింది. దీంతో దాతలు ముందుకు రావాలని స్థానిక అధికారులు కోరుతున్నారు.