ఎల్‌ఐసీ కొత్త మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) మైక్రో బచత్ పేరుతో కొత్త మైక్రో ఇన్సూరెన్స్ పాలసీని తీసుకువచ్చింది. రక్షణతోపాటు, పొదుపు కలిసి ఉండటం ఈ పాలపీ ప్రత్యేకత. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎల్‌ఐసీ జోనల్‌ మేనేజర్‌ టి.సి.సుశీల్‌ కుమార్‌ దీన్ని విడుదల చేశారు. కొత్త పాలసీలో రూ.50,000 నుంచి రూ.2 లక్షల వరకూ జీవిత బీమా రక్షణ ఉంటుందని తెలిపారు. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలో రూ.2 లక్షల వరకూ కవరేజ్ ఉండటం ఇదే తొలిసారి. 18-55 ఏళ్ల […]

ఎల్‌ఐసీ కొత్త మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ
Follow us

| Edited By:

Updated on: Feb 19, 2019 | 4:56 PM

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) మైక్రో బచత్ పేరుతో కొత్త మైక్రో ఇన్సూరెన్స్ పాలసీని తీసుకువచ్చింది. రక్షణతోపాటు, పొదుపు కలిసి ఉండటం ఈ పాలపీ ప్రత్యేకత. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎల్‌ఐసీ జోనల్‌ మేనేజర్‌ టి.సి.సుశీల్‌ కుమార్‌ దీన్ని విడుదల చేశారు.

కొత్త పాలసీలో రూ.50,000 నుంచి రూ.2 లక్షల వరకూ జీవిత బీమా రక్షణ ఉంటుందని తెలిపారు. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలో రూ.2 లక్షల వరకూ కవరేజ్ ఉండటం ఇదే తొలిసారి. 18-55 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు ఎలాంటి ఆరోగ్య పరీక్షలు లేకుండానే ఈ పాలసీని తీసుకోవచ్చు. పాలసీ వ్యవధిలో పాలసీదారుడు చనిపోతే బీమా మొత్తం ఒకేసారి కుటుంబ సభ్యులకు వస్తుంది. లేకపోతే పాలసీ వ్యవధి ముగిసిన తర్వాత పాలసీదారుడు మెచ్యూరిటీ మొత్తాన్ని పొ౦దవచ్చు. వయసు, ఎంచుకున్న వ్యవధి, బీమా మొత్తం ఆధారంగా ప్రీమియం ఆధారపడి ఉంటుంది.