సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే

తెలుగుదేశం పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ పూర్తి చేసి, తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం సిట్ ఏర్పాటుతోపాటు దర్యాప్తుపై స్టే విధించింది.

సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 16, 2020 | 7:10 PM

అమరావతి రాజధాని భూముల అవకతవకలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం కార్యకలాపాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. సిట్ ఏర్పాటుతో పాటు మంత్రివర్గ ఉప సంఘం తదుపరి కార్యాచరణపై కూడా స్టే విధిస్తూ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

సిట్ ఏర్పాటును సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని భూములపై సిట్ ఏర్పాటు, టీడీపీ హయాంలో జరిగిన పనులపై విచారణకు మంత్రివర్గ ఉప సంఘం నియామకాన్ని వీరిద్దరు హైకోర్టులో సవాల్ చేశారు.

తెలుగుదేశం పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ పూర్తి చేసి, తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసిన ఉన్నత న్యాయస్థానం సిట్ ఏర్పాటుతోపాటు దర్యాప్తుపై స్టే విధించింది. చంద్రబాబు హయాంలో జరిగిన పనులపై విచారణకు మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడాన్ని కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిలువరించింది. మంత్రివర్గ ఉప సంఘం విచారణ, సిట్ దర్యాప్తులో తదుపరి చర్యలు తీసుకో రాదన్నది మధ్యంతర ఉత్తర్వుల సారాంశం.