టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు ప్రశ్నలవర్షం

ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలతో అనర్హత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై హైదరాబాద్ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పౌరసత్వ వివాదంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న చెన్నమనేని రమేశ్ విషయాన్ని సోమవారం హైకోర్టు విచారించింది. చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు ప్రశ్నల పరంపరను సంధించింది. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు కోర్టుకు తెలిపిన కేంద్ర హోంశాఖ నివేదిక ఆధారంగా రమేశ్‌ని విచారించింది హైకోర్టు బెంచ్. జర్మనీ పాస్‌పోర్టుతో చెన్నై నుండి జర్మనీ వెళ్లినట్టు హైకోర్టుకు […]

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు ప్రశ్నలవర్షం
Rajesh Sharma

|

Feb 10, 2020 | 5:16 PM

ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలతో అనర్హత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై హైదరాబాద్ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. పౌరసత్వ వివాదంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న చెన్నమనేని రమేశ్ విషయాన్ని సోమవారం హైకోర్టు విచారించింది. చెన్నమనేని రమేష్‌కు హైకోర్టు ప్రశ్నల పరంపరను సంధించింది.

చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరసత్వాన్ని కలిగి ఉన్నట్లు కోర్టుకు తెలిపిన కేంద్ర హోంశాఖ నివేదిక ఆధారంగా రమేశ్‌ని విచారించింది హైకోర్టు బెంచ్. జర్మనీ పాస్‌పోర్టుతో చెన్నై నుండి జర్మనీ వెళ్లినట్టు హైకోర్టుకు కేంద్ర హోంశాఖ తెలిపింది. భారత పౌరసత్వం ఉందని చెబుతూ జర్మని పాస్‌పోర్టుతో ఎందుకు వెళ్ళారని చెన్నమనేనిని నిలదీసింది హైకోర్టు.

జర్మనీ పౌరసత్వాన్ని రద్దు చేసుకున్నట్లు చెబుతున్నా.. ఇప్పటికీ ఆ దేశ పాస్‌పోర్టునే రమేశ్ వినియోగిస్తున్నారంటూ కేంద్ర హోం శాఖ హైకోర్టుకు నివేదించింది. జర్మనీ పౌరసత్వం ఎప్పుడో రద్దు చేసుకున్నట్లు కోర్టుకు తెలిపిన చెన్నమనేనినిని ‘‘జర్మనీ సిటిజన్ షిప్ వదులుకున్నారా.. అందుకు జర్మనీ ప్రభుత్వం ఆమోదించిందా? ’’ అని ప్రశ్నించింది హైకోర్టు. జర్మనీ పౌరసత్వం రద్దు చేసుకున్నట్లు, పూర్తి వివరాలతో కౌంటర్ ధాఖలు చేయాలని చెన్నమనేనికి హైకోర్టు అదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు కేంద్ర హోంశాఖ రద్దు చేసిన ఉత్తర్వులపై స్టే కొనసాగించాలని ఆదేశాలిచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 24 కు హైకోర్టు వాయిదా వేసింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu