కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షల తీరుతెన్నులపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా పరీక్షలు అందరికీ ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కరోనా పరీక్షలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Follow us

|

Updated on: May 08, 2020 | 6:38 PM

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షల తీరుతెన్నులపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా పరీక్షలు అందరికీ ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేవలం అనుమానితులకే పరీక్షలు ఎందుకు చేస్తున్నారని, పూర్తి స్థాయి పరీక్షలు చేయకపోతే కరోనా వ్యాప్తికి సంబంధించిన వాస్తవాలు తెలియవని హైకోర్టు కామెంట్ చేసింది. ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్‌)పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు ఎందుకు చేయట్లేదని హైకోర్టు ప్రశ్నించింది.

అనుమానితులకు పరీక్షలు చేయాలని ఎందుకు నిర్ణయించారో తెలపాలని అడగ్గా.. డబ్ల్యూహెచ్‌వో, కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వ్యవహరిస్తున్నామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికే పరీక్ష చేయాలని మార్గదర్శకాల్లో ఎక్కడుందని.. వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు ఎందుకు చేయట్లేదో తెలపాలని హై కోర్టు ఏజీని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను మే 14వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు పండ్ల అమ్మకాల కోసం ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేయాలన్న మరో వ్యాజ్యంపై కూడా శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. విశ్రాంత వెటర్నరీ వైద్యుడు నారాయణరెడ్డి పిల్ పై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. లాక్ డౌన్ పీరియడ్‌లో పండ్ల విక్రయాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయవచ్చో తెలపాలని హైకోర్టు ఏజీని అడిగింది. మరో పది రోజుల్లో మామిడి, నిమ్మ అమ్మకాలు ముగుస్తాయని, సీజనల్ పండ్ల అమ్మకాలకు ఏర్పాట్లు చేయకపోతే రైతులు నష్టపోతారని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా.. లాక్ డౌన్ లో పండ్ల విక్రయాలకు ప్రభుత్వం అనుమతించిందని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు. ఎలాంటి ఉత్తమ ఏర్పాట్లు చేయగలరో మే 13లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది.

ఇక లాక్ డౌన్ పీరియడ్‌లో కూరగాయలు, మాంసం ధరలు పెంచారన్న మరో వ్యాజ్యంపై కూడా హైకోర్టులో విచారణ జరిగింది. కూరగాయల ధరలపై క్షేత్రస్థాయి నివేదిక సమర్పించింది న్యాయ సేవాధికార సంస్థ. గుడ్లు, టమోటోలు మినహా నిత్యావసర ధరలన్నీ పెరిగాయని నివేదించింది. కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంపై విచారం వ్యక్తం చేసిన హైకోర్టు.. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నాయన్నాయని అసహనం వ్యక్తం చేసింది. అయితే… ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అడ్వొకేట్ జనరల్.. హైకోర్టుకు నివేదించారు. ధరల పెరుగుదలపై కూడా మే 13వ తేదీలోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. మెట్రో సమయం పొడగింపు
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!