విశాఖ బాధితుల కోసం 30 కోట్లు

విశాఖ గ్యాస్ బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు వేగంగా తీసుకుంటున్నారు. బాధితులకు పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి శుక్రవారం 30 కోట్లు మంజూరు చేశారు.

విశాఖ బాధితుల కోసం 30 కోట్లు
Follow us

|

Updated on: May 08, 2020 | 5:37 PM

విశాఖ గ్యాస్ బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు వేగంగా తీసుకుంటున్నారు. బాధితులకు పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి శుక్రవారం 30 కోట్లు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్.

మృతుల కుటుంబాలకు ఒక్కొకరికి కోటి రూపాయలు, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి పదేసి లక్షలు, రెండు, మూడు రోజులు హాస్పిటల్‌లో ఉన్నవారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. సాధారణ చికిత్స పొందుతున్న వారికి 25 వేల రూపాయలు, బాధిత గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయంగా 10 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు విడుదల చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్‌కు మొత్తం డబ్బులు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్ మాట ఇచ్చిన 24 గంటల్లోనే పరిహారం చెల్లింపునకు ఆదేశాలు జారీ చేశారు.