అగ్రిగోల్డ్‌కు మరో ఝలక్.. మొన్న అరెస్టులు.. ఇపుడు ఆస్తుల జప్తు.. సీజ్ చేసిన ఆస్తుల విలువ వింటే షాకే..!

అగ్రిగోల్డు నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఛైర్మెన్ సహా మొత్తం ముగ్గురిని ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఆ సంస్థకు మరో ఝలక్...

అగ్రిగోల్డ్‌కు మరో ఝలక్.. మొన్న అరెస్టులు.. ఇపుడు ఆస్తుల జప్తు.. సీజ్ చేసిన ఆస్తుల విలువ వింటే షాకే..!
Follow us

|

Updated on: Dec 24, 2020 | 2:53 PM

ED ATTACHES AGRI-GOLD ASSETS: అగ్రిగోల్డు నిర్వాహకులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఛైర్మెన్ సహా మొత్తం ముగ్గురిని ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఆ సంస్థకు మరో ఝలక్ తగిలింది. తాజాగా గురువారం నాడు అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది. 4109 కోట్ల రూపాయల విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

డిపాజిటర్ల నుంచి వేల కోట్ల రూపాయలను వసూలు చేసి.. ఆ డబ్బులతో సొంత ఆస్తులు కొనుక్కునేందుక షెల్ కంపెనీలకు నిధులు మళ్ళించారన్న అభియోగాలను అగ్రగోల్డు నిర్వాహకులు ఎదుర్కొంటున్నారు. అగ్రిగోల్డ్ సంస్థకు పలు రాష్ట్రాలలో ఆస్తులున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఒడిశా రాష్ట్రాలలో అగ్రిగోల్డ్ సంస్థకు వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. గురువారం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నాలుగు రాష్ట్రాలలోని అగ్రిగోల్డు ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసుకుంది.

ఏపీలో విజయవాడ-గుంటూరు మధ్య వున్న 56 ఎకరాల హాయ్ లాండ్ ఆస్తులు తాజాగా జప్తు చేసిన వాటిలో వున్నాయి. పలు కంపెనీల్లో వాటాలు, యంత్రాలను కూడా ఈడీ అటాచ్ చేసేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా అగ్రి గోల్డు ఆస్తులను జప్తు చేశామని, తమ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.

ఇదిలా వుండగా.. అగ్రిగోల్డ్ స్కామ్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఆ సంస్థకు చెందిన ముగ్గురు డైరెక్టర్లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా డిసెంబర్ 23న ఆ డెరెక్టర్లను ఈడీ కోర్టులో హాజరు పర్చింది. నిందితులను కస్టడీ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసింది. కేసు విచారణ చేపట్టిన న్యాయ స్థానం నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

అగ్రిగోల్డ్ డైరెక్టర్లంతా కలిసి రూ. 6,400 కోట్ల స్కామ్‌కు పాల్పడినట్లు ఈడీ అధికారులు తేల్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో డిపాజిటర్లను అగ్రిగోల్డ్ యాజమాన్యం అడ్డంగా ముంచింది. అలా వచ్చిన సొమ్ముతో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారు. అగ్రిగోల్డ్ స్కామ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. అగ్రిగోల్డులో పెట్టుబడి పెట్టి ఎందరో డిపాజిటర్లు తీవ్రంగా నష్టపోయారు. డిపాజిటర్లు, ఏజెంట్లు పలువురు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలంటూ నాటి ఉమ్మడి హైకోర్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని సూచించింది.

ఇదీ చదవండి: జేసీ ఇంటిపై ఎమ్మెల్యే ఫాలోవర్స్ దాడి.. తాడిపత్రిలో ముదిరిన సోషల్ మీడియా వార్

ఇదీ చదవండి: ఫెలో షిప్పుల మంజూరులో అక్రమాలు.. ఓయూ, కేయూలపై హైకోర్టులో పిల్

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు