కామ్రేడ్ల యూటర్న్‌ వెనుక కారణమేంటి ?

తుది అంకానికి చేరుకున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీలో లేకుండానే బారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) విశేషంగా వార్తలకెక్కింది. ఎన్నికల బరిలో వుండి ప్రత్యర్థులతో వాగ్బాణాలు సంధించే స్థితి  నుంచి వారికో.. వీరికో మద్దతిచ్చే స్థాయికి పడిపోయిన కామ్రేడ్లు.. ఉప ఎన్నిక సందర్భంగా వేసిన పిల్లి మొగ్గలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు ముందుగా గత ఎన్నికల్లో ఏర్పాటైన మహాకూటమి అలాగే వుంటుందా లేక ఎవరికి వారే యమునా తీరే అన్న […]

కామ్రేడ్ల యూటర్న్‌ వెనుక కారణమేంటి ?
Follow us

|

Updated on: Oct 16, 2019 | 12:19 PM

తుది అంకానికి చేరుకున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పోటీలో లేకుండానే బారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) విశేషంగా వార్తలకెక్కింది. ఎన్నికల బరిలో వుండి ప్రత్యర్థులతో వాగ్బాణాలు సంధించే స్థితి  నుంచి వారికో.. వీరికో మద్దతిచ్చే స్థాయికి పడిపోయిన కామ్రేడ్లు.. ఉప ఎన్నిక సందర్భంగా వేసిన పిల్లి మొగ్గలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చింది మొదలు ముందుగా గత ఎన్నికల్లో ఏర్పాటైన మహాకూటమి అలాగే వుంటుందా లేక ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా విడివిడిగా పోటీ చేస్తారా అన్న చర్చ మొదలైంది. అనుకున్నట్లుగానే కాంగ్రెస్, టిడిపి ఎవరికి వారే పోటీ  చేసేందుకు సిద్దమై తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగస్తులైన టిజెఎస్, సిపిఐ పార్టీలు ఎటు మొగ్గుచూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. కోదండరామ్ నేతృత్వంలోని టిజెఎస్.. సహజంగానే కెసీఆర్ మీదున్న ద్వేషంతో కాంగ్రెస్ పక్కన చేరింది. ఇక మిగిలింది సిపిఐ.. కాగా ఈ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీతోపాటు.. టిఆర్ఎస్ పార్టీకూడా ప్రయత్నించింది. కారణాలపై ఎన్నో ఊహాగానాలు చెలరేగినా చివరికి సిపిఐ నేతలు టిఆర్ఎస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించారు.

ఆ తర్వాతే అసలు ట్విస్టు మొదలైంది. ఈలోగా తెరమీదికొచ్చిన ఆర్టీసీ సమ్మె.. సిపిఐ నిర్ణయంపై పెను ప్రభావాన్ని చూపింది. నిజానికి టిఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్‌కు సిపిఐ నేతలు లొంగిపోయారని సోషల్ మీడియా కోడై కూసింది. ఈక్రమంలో మొదలైన ఆర్టీసీ సమ్మె.. అందులో కీలక భాగస్వామి అయని ఎంప్లాయిస్ యూనియన్.. సిపిఐ నేతలపై ఒత్తిళ్ళకు దిగింది. నిజానికి సిపిఐ పార్టీ అనుబంధ సంఘాల్లో ఎంతో కొంత ప్రభావం కలిగి వున్న సంఘం ఏదైనా వుందీ అంటే అది కేవలం ఎంప్లాయిస్ యూనియన్ మాత్రమే. అలాంటి ఈయూ ఒత్తిడికి సహజంగానే సిపిఐ పెద్దలు లొంగాల్సి వచ్చిందన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఒక వైపు కాస్తో కూస్తూ మిగిలిన క్యాడర్ … ఎంప్లాయిస్ యూనియన్‌దే.. అలాంటి అనుబంధ సంఘాన్ని కాదనే ధైర్యం లేకపోవడంతో సిపిఐ నాయకత్వం వారి డిమాండ్ మేరకు హుజూర్‌నగర్లో టిఆర్ఎస్‌ పార్టీకిచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. యూ టర్న్ తీసుకున్నారన్న అపవాదును మోసేందుకు కూడా సిపిఐ నేతలు సిద్దపడ్డారంటే అది ఈయూ ఒత్తిడి ఫలితమేనన్నది నిర్వివాదాంశం. అయితే.. కొన్ని వర్గాలు సిపిఐ యూ టర్న్ వెనుక మరో కారణాన్ని కూడా చూపుతున్నాయి.

గులాబీ పార్టీ నుంచి సిపిఐ నేతలు భారీ నజరానా పొందారని, చాడా వెంకట రెడ్డి లాంటి నేతలకు ఎమ్మెల్సీ పదవిని కూడా కెసీఆర్ ఆఫర్ చేశారని సోషల్ మీడియాలో పలు కథనాలు ప్రత్యక్షమవడం కూడా సిపిఐ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. దీనిపై చాడాను పలువురు పార్టీ సీనియర్లు నిలదీయడంతో ఆయన కినుక వహించారని సమాచారం. ఈ క్రమంలో ఈయూ ఒత్తిడి రావడంతో.. దాన్ని అనుకూలంగా మార్చుకుని యూ టర్న్‌కు సిపిఐ రాష్ట్ర నాయకత్వం సిద్దమైందని తెలుస్తోంది. ఏది ఏమైనా.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరని మరోసారి నిరూపణ అయ్యిందీ ఈ ఉదంతంతో…

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..