ఏపీలో 5 లక్షలకు చేరువైన కరోనా కేసులు..

ఏపీలో కరోనా వైరస్ కేసులు తీవ్ర‌త భారీగా పెరిగింది. అయితే మునపటి కంటే మరణాల సంఖ్య తగ్గడం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారీ 10,794 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.

  • Ravi Kiran
  • Publish Date - 5:57 pm, Sun, 6 September 20
ఏపీలో 5 లక్షలకు చేరువైన కరోనా కేసులు..

ఏపీలో కరోనా వైరస్ కేసులు తీవ్ర‌త భారీగా పెరిగింది. అయితే మునపటి కంటే మరణాల సంఖ్య తగ్గడం కాస్త ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారీ 10,794 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,98,125కి చేరాయి. అలాగే 24 గంట‌ల్లో కొత్త‌గా 70 మంది మృతి చెందగా, ఇప్ప‌టివ‌ర‌కూ చ‌నిపోయిన‌ వారి సంఖ్య 4417కి పెరిగింది. ఇక ప్రస్తుతం ఏపీలో 99,689 యాక్టివ్ కేసులు నమోదవ్వగా, 3,94,019 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో ఈ రోజు వరకూ 41,07,890 మందికి ఏపీ ప్రభుత్వం కరోనా పరీక్షలు నిర్వహించింది. (Coronavirus Updates in AP)

కాగా జిల్లాల వారీగా కొత్త కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురంలో 753, చిత్తూరులో 927, తూర్పు గోదావరిలో 1244, గుంటూరులో 703, కడపలో 904, కృష్ణాలో 457, కర్నూలులో 380, నెల్లూరులో 1299, ప్రకాశంలో 1042, శ్రీకాకుళంలో 818, విశాఖలో 573, విజయనగరంలో 593, పశ్చిమ గోదావరిలో 1101 కేసులు నమోదయ్యాయి.