చంద్రబాబు ఆరోపణ తప్పని తేల్చిన కేబినెట్

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు తప్పని నిరూపించింది ఏపీ కేబినెట్. గురువారం జరిగిన సుదీర్ఘ భేటీలో తీసుకున్న ఓ నిర్ణయం..

చంద్రబాబు ఆరోపణ తప్పని తేల్చిన కేబినెట్
Follow us

|

Updated on: Nov 05, 2020 | 5:42 PM

Cabinet proved Chandrababu false: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు తప్పని నిరూపించింది ఏపీ కేబినెట్. గురువారం జరిగిన సుదీర్ఘ భేటీలో తీసుకున్న ఓ నిర్ణయం చంద్రబాబుతో సహా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం తప్పని తేల్చింది. విశాఖ నుంచి సాఫ్ట్ వేర్ సంస్థలు తరలి వెళ్ళిపోతున్నాయంటూ టీడీపీ నేతలు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని స్పష్టమైంది.

విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు కేంద్ర అంగీకారం తెలిపిన నేపథ్యంలో 150 ఎకరాలలో డేటా సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో అదానీ డేటా సెంటర్‌కు 500 ఎకరాలు కేటాయించగా.. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదానీ డేటా సెంటర్ విశాఖ నుంచి తరలి వెళ్ళిపోయిందని చంద్రబాబు ఇటీవల ఆరోపించారు. అయితే.. తాజాగా 150 ఎకరాలలో డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ గ్రూపు సంసిద్ధత వ్యక్తం చేయగా.. గురువారం నాడు కేబినెట్ దానిని ఆమోదించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు తెలిపారు.

ఇదిలీ వుండగా.. వైద్య ఆరోగ్య శాఖలోని టీచింగ్ సిబ్బందికి యూజీసీ స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా నాలుగు వందల కోట్ల రూపాయల అదనపు భారం పడుతున్నా.. దాదాపు 3500 మందికి ప్రయోజనం కలుగుతుందని కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన కన్నబాబు వివరించారు. వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ది పొందని అర్హులకు సంక్షేమ పథకాలను వర్తింప చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానించినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రక్రియ నవంబర్ ఆరో తేదీ నుంచే ప్రారంభిస్తామన్నారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని నవంబర్ పదో తేదీ నుంచి మరో ఆరు జిల్లాల్లో అందుబాటులోకి తేనున్నట్లు కన్నబాబు తెలిపారు.

ALSO READ: భూసర్వేపై జగన్ కేబినెట్ సంచలన నిర్ణయం

ALSO READ: బందరు పోర్టుపై కేబినెట్ కీలక నిర్ణయం

ALSO READ: టీడీపీ నేతలకు ‘సుప్రీం’ నోటీసులు

ALSO READ: వండర్ కలెక్టర్ టీచరైన వేళ!

ALSO READ: పాకిస్తాన్ మరో దుష్ట పన్నాగం.. ఇండియా తీవ్ర అభ్యంతరం

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్