బీజేపీ నోట మధ్యంతరం మాట.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కమల నాథులు.. జమిలా ? లేక ఇంకేదైనా లిటిగేషనా?

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో బీజేపీ నేతల మాటల్లో పదును పెరుగుతోంది.

బీజేపీ నోట మధ్యంతరం మాట.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కమల నాథులు.. జమిలా ? లేక ఇంకేదైనా లిటిగేషనా?
Follow us

|

Updated on: Nov 28, 2020 | 4:36 PM

BJP leaders speaks on mid-term elections: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో బీజేపీ నేతల మాటల్లో పదును పెరుగుతోంది. ప్రచారాన్ని వేడెక్కిస్తున్న కమలనాథుల నోట తాజాగా మధ్యంతర ఎన్నికల మాట వ్యక్తమైంది. తెలంగాణ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని ప్రకటించారు బీజేపీ తెలంగాణ యూనిట్ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.

గ్రేటర్ ప్రచారంలో భాగంగా బండి సంజయ్ శనివారం ముషీరాబాద్ ఏరియాలో రోడ్ షోలో పాల్గొన్నారు. భోలక్‌పూర్ ఏరియాలో రోడ్‌షోలో ప్రసంగించారు. ‘‘ ఈ జీ.హెచ్.ఎం.సీ. ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతోంది.. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రభుత్వం నిలబడదు. తెరాస ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు.. ఎక్కువ రోజులు నిలబడే అవకాశం లేని ఈ ప్రభుత్వానికి పోలీసు అధికారులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు..? సీఎం స్క్రిప్టును మీరెందుకు చదువుతున్నారు..? ప్రజలు మా వైపు ఉన్నారు.. పోలీసు అధికారులు ఇది గుర్తుపెట్టుకోవాలి.. ’’ అంటూ పోలీసులను బండి సంజయ్ హెచ్చరించారు.

ALSO READ: శ్రీవారి భక్తులకు శుభవార్త… టీటీడీ బోర్డు కీలక నిర్ణయం