అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: ఇండియానాలో ట్రంప్ విజయం

అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదన్నది ఆసక్తిగా మారింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దసంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు. వేర్వేరు టైమ్‌ జోన్స్‌ కారణంగా పోలింగ్‌ సమయం ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంది. ముందుగానే 10 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ముగిసిన కొన్ని గంటల్లోనే విజేత ఎవరో తెలిసే అవకాశం కనిపించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ‘మెయిల్‌–ఇన్‌ బ్యాలెట్ల లెక్కింపుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉండడమే ఇందుకు కారణంగా మారింది. అమెరికాలో సుమారు 25 […]

  • Venkata Narayana
  • Publish Date - 7:10 am, Wed, 4 November 20
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు: ఇండియానాలో ట్రంప్ విజయం

అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదన్నది ఆసక్తిగా మారింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దసంఖ్యలో ఓటర్లు తరలివచ్చారు. వేర్వేరు టైమ్‌ జోన్స్‌ కారణంగా పోలింగ్‌ సమయం ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉంది. ముందుగానే 10 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ముగిసిన కొన్ని గంటల్లోనే విజేత ఎవరో తెలిసే అవకాశం కనిపించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ‘మెయిల్‌–ఇన్‌ బ్యాలెట్ల లెక్కింపుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉండడమే ఇందుకు కారణంగా మారింది. అమెరికాలో సుమారు 25 లక్షల మంది భారతీయ ఓట్లు కీలకంగా మారాయి. అందరూ ఓటు వేసేలా ట్వీట్లతో ఉత్సాహపరిచారు ట్రంప్‌, బైడెన్‌. కాగా, ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పలు చోట్ల ట్రంప్, బైడెన్ మధ్య హోరా హోరీ పోరు సాగుతోంది. ఇండియానాలో ట్రంప్ విజయం విజయం సాధించారు.