అఖిల్ జోడీగా విజయ్ దేవరకొండ హీరోయిన్..?

అఖిల్ జోడీగా విజయ్ దేవరకొండ హీరోయిన్..?

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నాల్గోవ చిత్రంలో నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్.. అఖిల్‌కు జోడీగా ప్రియాంకను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటించిన ‘టాక్సీవాలా’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. ఆ చిత్రంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో రవితేజ సరసన ‘డిస్కో రాజా’లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మను తాజాగా […]

TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:17 PM

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నాల్గోవ చిత్రంలో నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్.. అఖిల్‌కు జోడీగా ప్రియాంకను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ప్రధానపాత్రలో నటించిన ‘టాక్సీవాలా’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక.. ఆ చిత్రంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో రవితేజ సరసన ‘డిస్కో రాజా’లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మను తాజాగా అఖిల్ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ప్రియాంకకు మరో మంచి అవకాశం వచ్చినట్లే. కాగా త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu