ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ అధికారి

మరో అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కింది. రంగారెడ్డి జిల్లా ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్న రఘునాధ్ రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 5:23 pm, Tue, 30 June 20
ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ అధికారి

మరో అవినీతి చేప ఏసీబీ వలలో చిక్కింది. రంగారెడ్డి జిల్లా ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్న రఘునాధ్ రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆరోగ్య శ్రీ లో ఓ డెంటల్ హాస్పిటల్ రెన్యూవల్ కోసం రూ. 30 వేలు డిమాండ్ చేశాడు. అయితే రూ.25 వేలు ఇచ్చేందుకు హాస్పిటల్ యాజమాన్యం అంగీకరించారు. కానీ రోజుల తరబడి సాగిస్తుండడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాగా, ఒప్పందంలో భాగంగా రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. రఘునాధ్ కార్యాలయంతో పాటు ఆయన ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. రఘునాధ్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.