కుప్పకూలిన వంతెన.. ఇద్దరు మృతి..

యూపీలో దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ వంతెన అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

  • Tv9 Telugu
  • Publish Date - 11:55 am, Sat, 20 June 20
కుప్పకూలిన వంతెన.. ఇద్దరు మృతి..

యూపీలో దారుణం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ వంతెన అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. రాష్ట్రంలోని ఈటా జిల్లాలోని మాల్వన్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నేషనల్ హైవేకి సమీపంలో ఈ వంతెన నిర్మాణం కొనసాగుతోంది. అయితే వంతెన కుప్పకూలిన సమయంలో కార్మికులు ఎవరు అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కానీ అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వాహనంపై వంతెన కుప్పకూలింది. దీంతో వాహనం మొత్తం నుజ్జునుజ్జయ్యింది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలికి పోలీసులు, రెస్క్యూ టీం చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక వంతెన నిర్మాణం పనులు జరుగుతున్నప్పుడు కనీస జాగ్రత్తలు పాటించని కాంట్రాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామన్నారు.