Breaking : హాథ్రస్ కేసులో​ తీర్పు రిజర్వ్​ చేసిన సుప్రీం

హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు మగిశాయి. సీజేఐ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

Breaking : హాథ్రస్ కేసులో​ తీర్పు రిజర్వ్​ చేసిన సుప్రీం
Follow us

|

Updated on: Oct 15, 2020 | 2:40 PM

హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు మగిశాయి. సీజేఐ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. హాథ్రస్ బాధిత కుటుంబానికి  యూపీ ప్రభుత్వం తగిన భద్రత కల్పించిందని సొలిసిటర్  జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. న్యాయ సహాయం విషయంలో ఇప్పటికే ప్రవేటు లాయర్లు బాధిత కుటుంబం తరపున ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఇక విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలని బాధిత కుటుంబం తరపు న్యాయవాది సీమా కుష్వాహ కోర్టును కోరారు. సీబీఐ స్టేటస్ రిపోర్ట్‌ను యూపీ ప్రభుత్వానికి కాకుండా సుప్రీంకోర్టు సమర్పించేలా చూడాలని సీమా కుష్వాహ కోర్టుకు అభ్యర్థించారు.స్టేటస్ రిపోర్టు నేరుగా కోర్టుకు సమర్పించడంలో తమకు ఎటుంటి అభ్యంతరం లేదని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఈ కేసు మొత్తం విచారణ అలహాబాద్ హైకోర్టును చేయనివ్వాలని సీజేఐ సూచించారు. అంతిమంగా ఈ కేసు విచారణపై తమ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు.

Also Read :

దింపుడుకల్లం వద్ద పిలుపుకు స్పందన, ఆస్పత్రికి తీసుకెళ్తే..

ట్రాక్టర్‌ తిరగబడి కొడుకు మరణం, బాధ తట్టుకోలేక ఆగిన తల్లి గుండె