నడిగర్ సంఘం ఎన్నికలు రద్దు!

Nadigar Sangam Elections, నడిగర్ సంఘం ఎన్నికలు రద్దు!

తమిళ చిత్రసీమ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే నడిగర్ సంఘం ఎన్నికలు అనూహ్యంగా రద్దయ్యాయి. అసలు జరిగిందేమిటంటే.. జూన్ 23న జరగాల్సిన ఈ ఎన్నికలను ఎంజిఆర్ జానకి కాలేజీలో నిర్వహించాలనుకున్నారు. అయితే అది ఎక్కువగా పబ్లిక్ తిరిగే ప్రాంతం కావడంతో ఎన్నికలను వాయిదా వెయ్యమని మద్రాస్ హైకోర్టు చెప్పింది. అటు విశాల్ బృందం తమను ఓటర్ల జాబితా నుంచి తొలిగించారంటూ 61 మంది సభ్యులు రిజిస్టర్‌కు ఫిర్యాదు చేశారు. దానితో ఈ ఎన్నికలను రద్దు చేస్తున్నట్లు సొసైటీ రిజిస్టర్ ఓ ప్రకటనలో తెలియజేశారు.

ఇక ఈ విషయంపై స్పందించిన హీరో విశాల్.. ఓటరు లిస్ట్ నుంచి తొలిగించిన వారిలో 13 మంది మాత్రమే ఓటు వేయడానికి అర్హులని, దీనిపై రిజిస్టర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం అని పేర్కొన్నారు. కాగా ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరగాలని విశాల్ బృందం గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అయితే నడిగర్ సంఘం ఎన్నికలు రద్దవడంతో ఇప్పుడు కోలీవుడ్ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *