బ్రెజిల్ లో కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకున్న వలంటీర్ మృతి

బ్రెజిల్ లో  కోవిడ్ 19 వ్యాక్సీన్ తీసుకున్న ఓ వలంటీర్ మృతి చెందాడు. ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన ఈ వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్ జోరుగా సాగుతున్నాయి. ఒక వలంటీర్ మరణించినట్టు ప్రకటించిన బ్రెజిలియన్

బ్రెజిల్ లో కోవిడ్-19 వ్యాక్సీన్ తీసుకున్న వలంటీర్ మృతి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 22, 2020 | 10:36 AM

బ్రెజిల్ లో  కోవిడ్ 19 వ్యాక్సీన్ తీసుకున్న ఓ వలంటీర్ మృతి చెందాడు. ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన ఈ వ్యాక్సీన్ క్లినికల్ ట్రయల్స్ జోరుగా సాగుతున్నాయి. ఒక వలంటీర్ మరణించినట్టు ప్రకటించిన బ్రెజిలియన్ రొగ్య సంస్థ  అన్ విసా ..ట్రయల్స్ కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ ట్రయల్ సేఫ్టీ కి సంబంధించి ఎలాంటి ఆందోళన అనవసరమని పేర్కొంది. మెనింజైటిస్ వ్యాక్సీన్ తీసుకున్న కంట్రోల్ గ్రూప్ లో ఈ వాలంటీర్ ఒకడని, దీనితో బాటు కోవిడ్ టీకామందు కూడా తీసుకున్నాడని ఈ సంస్థ వెల్లడించింది. 28 ఏళ్ళ ఇతడు రియో డీ జెనీరోవాసి అని తెలుస్తోంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ని కో-ఆర్డినేట్ చేస్తున్న ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ సావో పాలో-ఈ వ్యక్తి ఎక్కడ, ఏ పరిస్థితుల్లో నివసిస్తున్నాడో తెలియదని పేర్కొంది. కాగా ఆస్ట్రా జెనికా కంపెనీ మాత్రం ఈ వాలంటీర్ మృతిపై స్పందించలేదు.