Breaking News
  • కీసర ఎమ్మార్వో కేసులో బయటపడుతున్న అక్రమాస్తులు. ఎమ్మార్వో ఆస్తులు 100 కోట్ల పైచిలుకు ఉంటుందని ఎసిబి అంచనా. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు అమ్మకాలు జరిపిన నాగరాజు. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో పెద్దగా ఆస్తులు కొనుగోలు. ఎమ్మార్వో ని పట్టుకున్న సంఘంలో కోటి ఇరవై ఎనిమిది లక్షలు స్వాధీనం. ఇంటిలో సోదా చేయగా 28 లక్షల రూపాయల నగదు లభ్యం.
  • కరోనా భారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకులు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను...సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని వర్గాల ప్రజలను ఈ కరోనా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. కరోనా మహమ్మారి త్వరగా పోయి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా భారిన పడకుండా రక్షించుకోవచ్చు
  • టుగెద‌ర్ యాజ్ ఒన్ పాట‌ను ట్వీట్ చేసిన చ‌ర‌ణ్‌. మంచి కాజ్ కోసం ఈ పాట అంటూ ట్వీట్ చేసిన రామ్‌చ‌ర‌ణ్‌. 65 మంది క‌లిసి పాడిన పాట అని ట్వీట్ చేసిన చ‌ర‌ణ్‌. 65 మంది గాయ‌కులు, ఐదు భాష‌ల్లో పాడిన పాట.
  • ఏఎస్సై రామకృష్ణ ఆత్మహత్య ప్రయత్నం. అధికారుల వేధింపులు తాళలేక సూసైడ్ అటెంప్ట్. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య ప్రయత్నం. స్థానిక జోడిమెట్ల లోని క్యూర్ వెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏ ఎస్ ఐ రామకృష్ణ.
  • స్వర్ణ పేలస్ ఫైర్ యాక్సిడెంట్ అగ్నిప్రమాదం పై ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చెసిన హీరో రామ్. రమేశ్ హాస్పిటల్ ఎండీ రమేశ్ కు అన్న కొడుకు హీరో రామ్. పెద్ద కుట్ర జరుగుతోంది.. సీఎం జగన్ ని తప్పుగా చూపించడానికి మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలీకుండా చేసే పనులు వాళ్ళమీ రివ్యూటేషన కి మీ మీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ జరుగుతోంది. స్వర్ణ పేలస్ ని రమేష్ ఆసుపత్రి కోవిడ్ హాస్పిటల్ గా తీసుకోకముందే దాన్ని ప్రభుత్వం కోవిడ్ సెంటర్ గా వినియోగించింది. అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఉంటే ఎవర్నీ నిందించేవాళ్ళు..హీరో రామ్.
  • రాఘ‌వేంద్ర‌రావు : కేసీఆర్‌గారి స్ఫూర్తితో ఎంపీ సంతోష్‌కుమార్‌గారు త‌ల‌పెట్టిన ఈ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాలి. మ‌ట్టి వినాయ‌కుడిని పూజిద్దాం. ప్ర‌కృతిని కాపాడుకుందాం. వినాయ‌కుడు అంటే మ‌న విఘ్నాల‌ను తొల‌గించేవాడు. అందుకే ద‌య‌చేసి పూజ పూర్త‌యిన త‌ర్వాత ఎవ‌రూ వినాయ‌కుడిని నిమ‌జ్జ‌నం చేయొద్దు. ఒక తొట్టిలో వేసి నీరుపోయండి. ఆ మట్టిలో మొక్క పెరుగుతుంది.

బ్రెజిల్‌లో కరోనా విలయ తాండవం.. అధ్యక్షుడికి పాజిటివ్..

కరోనా మహమ్మారి బ్రెజిల్‌లో విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఈ వైరస్ అక్క్డిడి ప్రజల్ని ఎవర్ని కూడా వదిలిపెట్టడం..
Brazil President Bolsonaro takes off mask after announcing he has tested Corona positive, బ్రెజిల్‌లో కరోనా విలయ తాండవం.. అధ్యక్షుడికి పాజిటివ్..

కరోనా మహమ్మారి బ్రెజిల్‌లో విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల దేశాల్లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. ఈ వైరస్ అక్క్డిడి ప్రజల్ని ఎవర్ని కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా దేశ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన వయస్సు 65 ఏళ్లు. ఈ విషయాన్ని ఆయన
మంగళవారం నాడు ఓ టీవీ షోలో జరుగుతున్న ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని.. కొన్ని కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. ప్రస్తుతం అజిత్రోమైసిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను వాడుతున్నానన్నారు.

కాగా, శనివార నాడు ఆయన సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పోస్ట్ చేశారు. అందులో అతడు జూలై 4వ తేదీన అమెరికా రాయబారితో పాటు.. పలువురు మంత్రులతో కలిసి భోజనం చేశాడు. అయితే ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తున్న సమయంలో.. కనీసం సోషల్ డిస్టెన్స్‌ కానీ.. మాస్క్‌ కానీ ధరించలేదు. ఆయన కరోనా మహమ్మారిని తేలికగా తీసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు కరోనా టెస్టులు చేయించుకున్నారు. అందులో రెండు సార్లు నెగెటివ్ వచ్చింది. తాజాగా మూడో సారి చేయించుకున్న సందర్భంగా కరోనా పాజిటివ్‌గా తేలింది.

Related Tags