ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేశారో.. రవాణాశాఖ హెచ్చరిక

గత వారం రోజులుగా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి. ప్రతి రోజు 150 బస్సులు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలకు

ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేశారో.. రవాణాశాఖ హెచ్చరిక
Follow us

| Edited By:

Updated on: Sep 13, 2020 | 7:23 AM

Andhra Pradesh private buses: గత వారం రోజులుగా ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రైవేట్ బస్సులు తిరుగుతున్నాయి. ప్రతి రోజు 150 బస్సులు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలకు వెళుతున్నాయి. అయితే ఈ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మొదట విజయవాడ-హైదరాబాద్‌ రూట్‌లలో తనిఖీలను మొదటు పెట్టారు. ఈ రూట్‌లో రోజూ 4వేల మంది ప్రయాణికులు వెళుతుండగా.. వారి నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు.  హైదరాబాద్‌ నుంచి విజయవాడకు స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.1,200 వరకు.. నాన్‌ ఏసీలో రూ.700 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. దీనిపై రవాణాశాఖ అదనపు కమిషనర్‌ ప్రసాదరావు మాట్లాడుతూ.. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు నడపాలని, ప్రయాణికుల అవసరాలను అవకాశంగా తీసుకుని అధిక రేట్లు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More:

‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 : డబ్బింగ్‌ మొదలెట్టిన మనోజ్‌ భాజ్‌పాయ్‌

కుమార్తెతో కలిసి రోహిత్​ డ్యాన్స్ !