వణుకు రావడం, కునుకు తీయడం చాలా ప్రమాదకరం?

టీ తాగుతున్నప్పుడు ఎప్పుడైనా చిన్నపాటి వణుకు వస్తే ఎవరైనా దాన్ని పెద్ద విషయంగా తీసుకుంటారా? మధ్యాహ్న సమయంలో కునుకు వస్తే అదేదో ప్రమాదంగా భావిస్తామా? లేదు.. కానీ వాటిని కూడా గమనిస్తూ ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు. లండన్‌కు చెందిన కింగ్ కాలేజీ పరిశోధకులు బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడిన పలువురిపై పరిశోదన జరిపారు. వారికి బ్రెయిన్ క్యాన్సర్ రోగం వచ్చినట్టు తెలియకముందు ఆరోగ్యంలో వచ్చిన తేడాలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ అంశాలను వాళ్లు లైట్ తీసుకున్నారు. […]

వణుకు రావడం, కునుకు తీయడం చాలా ప్రమాదకరం?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 30, 2019 | 10:39 AM

టీ తాగుతున్నప్పుడు ఎప్పుడైనా చిన్నపాటి వణుకు వస్తే ఎవరైనా దాన్ని పెద్ద విషయంగా తీసుకుంటారా? మధ్యాహ్న సమయంలో కునుకు వస్తే అదేదో ప్రమాదంగా భావిస్తామా? లేదు.. కానీ వాటిని కూడా గమనిస్తూ ఉండాలని పరిశోధకులు చెబుతున్నారు. లండన్‌కు చెందిన కింగ్ కాలేజీ పరిశోధకులు బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడిన పలువురిపై పరిశోదన జరిపారు.

వారికి బ్రెయిన్ క్యాన్సర్ రోగం వచ్చినట్టు తెలియకముందు ఆరోగ్యంలో వచ్చిన తేడాలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ అంశాలను వాళ్లు లైట్ తీసుకున్నారు. అవే ప్రమదాకరంగా మారాయని ఇప్పుడు అనుకుంటున్నారా? వంటి ప్రశ్నలు వేసి సమాధానాలు నోట్ చేసుకున్నారు. పలువురు చెప్పిన సమాధానాల్లో టీ గురించి కూడా ఉంది. టీ తాగినప్పుడు చిన్నపాటి వణకులా ఒక్కసారి అలా వచ్చి ఇలా వెళ్లిపోయేదని ఒకరు చెప్పారు. అయితే దాన్ని చాలా తేలికగా తీసుకున్నట్టు చెప్పారు.

ఇంకొకరు నిద్ర విషయంలో మధ్యాహ్నం పూట కునుకుపై కూడా అనుమానం వ్యక్తం చేశారు. మరికొంతమంది మతిమరుపు, చేసే పనులపై శ్రద్ధ పెట్టకపోవడం, బంధాలకు అనుబంధాలకు ప్రాముక్యత ఇవ్వకపోవడం, ఆసక్తి తగ్గడం వంటి వాటిని కూడా తాము లైట్ తీసుకున్నామని, వయసు పెరుగుతున్నందున అలాంటి మార్పులు సహజం అని భవించామని తెలిపారు. అయితే వీటిని కూడా జాగ్రత్తగా గమనించాలని పరిశోధకులు చెబుతున్నారు. అవి బ్రెయిన్ క్యాన్సర్‌కు శరీరం చూపించే లక్షణాలు అయ్యిండొచ్చనే కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుందని అంటున్నారు.