పాకిస్తాన్, చైనాలకు వణుకు.. బ్రహ్మోస్ సూపర్​సోనిక్‌ను పరీక్షించనున్న భారత్​..

తన శక్తి సామర్థ్యాలేంటో పొరుగు దేశాలకు చాటి చెప్పాలని భారత్​ భావిస్తోంది. త్రివిధ దళాలతో హిందూ మహాసముద్రంలో బ్రహ్మోస్​ సూపర్​సోనిక్ క్రూజ్​ క్షిపణిని పరీక్షించేందుకు సిద్ధమవుతోంది....

పాకిస్తాన్, చైనాలకు వణుకు.. బ్రహ్మోస్ సూపర్​సోనిక్‌ను పరీక్షించనున్న భారత్​..
Follow us

|

Updated on: Nov 17, 2020 | 12:58 AM

పాకిస్థాన్​, చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో తన శక్తి సామర్థ్యాలేంటో పొరుగు దేశాలకు చాటి చెప్పాలని భారత్​ భావిస్తోంది. త్రివిధ దళాలతో హిందూ మహాసముద్రంలో బ్రహ్మోస్​ సూపర్​సోనిక్ క్రూజ్​ క్షిపణిని పరీక్షించేందుకు సిద్ధమవుతోంది. నవంబర్​ చివర్లో పలుమార్లు అత్యంత శక్తిమంతమైన ఈ క్షిపణి వ్యవస్థను పరీక్షించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం చైనా, పాకిస్థాన్​తో సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో తన సత్తా ఏంటో శత్రు దేశాలకు చూపాలని భావిస్తోంది భారత్​. ఇందులో భాగంగానే హిందూ మహాసముద్రంలో ఈ నెల చివరి వారంలో బ్రహ్మోస్ సూపర్​సోనిక్ క్రూజ్ క్షిపణితో పలు పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. భారత త్రివిధదళాల సారథ్యంలో వీటిని చేపట్టనుంది.

నవంబర్​ నెల చివరి వారంలో ఈ ప్రయోగాలు జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఫలితంగా బ్రహ్మోస్​ సూపర్​సోనిక్ క్రూజ్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలవుతుందని పేర్కొన్నాయి.కొత్తగా అభివృద్ధి చేసిన వాటితో పాటు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న క్షిపణి వ్యవస్థలను గత రెండు నెలల్లో విజయవంతంగా పరీక్షించింది డీఆర్​డీఓ. 800కి.మీ సుదూర లక్ష్యాలను ఛేదించగల శౌర్య క్షిపణి వ్యవస్థను కూడా పరీక్షించింది.

సుకోయ్-30 యుద్ధ విమానం, బ్రహ్మోస్ సూపర్​సోనిక్​ క్షిపణిలను బంగాళాఖాతంలో ప్రయోగించి సఫలీకృతమైంది.గల్వాన్​ లోయ ఘటన అనంతరం చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దులో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థతో యుద్ధవిమానాలను సైన్యం ఇప్పటికే మోహరించింది​. భారత నావికా దళం గత నెలలో ఐఎన్​ఎస్​ చెన్నై యుద్ధనౌక నుంచి ఈ క్షిపణి సామర్థ్యాన్ని పరీక్షించింది.

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!