పనైకులం తీరంలో బ్ర‌హ్మోస్ క్షిపణి శ‌క‌లం

తమిళనాడు : రామనాథపురం జిల్లాలోని పనైకులం తీరంలో బ్రహ్మోస్ క్షిపణి శకలం జాలర్లకు దొరికింది. తీరం వద్దకు ఓ భారీ సిలిండర్ లాంటి పరికరం కొట్టుకురావడాన్ని జాలర్లు గమనించారు. దీంతో  విషయాన్ని మెరైన్ బీచ్ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న అధికారులు తీరానికి చేరుకుని శకలాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొట్టుకొచ్చిన క్షిపణి శకలం బ్రహ్మోస్‌కు చెందినదిగా గుర్తించారు. ఇది 15 అడుగుల పొడవుతో.. దాదాపు వెయ్యి టన్నుల బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దానిపై బ్రహ్మోస్ లోగో […]

పనైకులం తీరంలో బ్ర‌హ్మోస్ క్షిపణి శ‌క‌లం
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2019 | 1:16 PM

తమిళనాడు : రామనాథపురం జిల్లాలోని పనైకులం తీరంలో బ్రహ్మోస్ క్షిపణి శకలం జాలర్లకు దొరికింది. తీరం వద్దకు ఓ భారీ సిలిండర్ లాంటి పరికరం కొట్టుకురావడాన్ని జాలర్లు గమనించారు. దీంతో  విషయాన్ని మెరైన్ బీచ్ అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న అధికారులు తీరానికి చేరుకుని శకలాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొట్టుకొచ్చిన క్షిపణి శకలం బ్రహ్మోస్‌కు చెందినదిగా గుర్తించారు. ఇది 15 అడుగుల పొడవుతో.. దాదాపు వెయ్యి టన్నుల బరువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దానిపై బ్రహ్మోస్ లోగో కూడా ఉందని.. 2016, అక్టోబర్ 24వ తేదీన తయారు చేసినట్లు దానిపై ఉన్నట్లు గుర్తించారు.